New Smartphone: అరాచకం ఫోన్ భయ్యా.. 21200mAh బ్యాటరీతో ఊరమాస్ మొబైల్ రెడీ

ప్రసిద్ధ ఫోన్ల తయారీ సంస్థ యూలెఫోన్ తన సరికొత్త Ulefone Armor 29 Pro 5G Thermal Version స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 15న లాంచ్ చేయనుంది. ఇందులో 21,200mAh భారీ బ్యాటరీ, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

New Update
Ulefone Armor 29 Pro 5G Thermal Version

Ulefone Armor 29 Pro 5G Thermal Version

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Ulefone తన లైనప్‌లో ఉన్న కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఈ కంపెనీ తన మొబైల్లలో భారీ బ్యాటరీ అందించి బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు చాలా స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి వచ్చి బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరొక భారీ బ్యాటరీ గల మొబైల్‌ను పరిచయం చేయడానికి కంపెనీ సిద్ధమైంది. 

Ulefone Armor 29 Pro 5G Thermal Version

ఉలేఫోన్ కంపెనీ తన కఠినమైన ఫోన్ Ulefone Armor 29 Pro 5G Thermal Version ను సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ప్రొఫెషనల్ స్థాయి థర్మల్ ఇమేజింగ్ ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మెరుగైన క్లారిటీ, సున్నితమైన ఇమేజింగ్‌ను అందిస్తుంది. ఇది పారిశ్రామిక, అత్యవసర, బహిరంగ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. 

కాగా కంపెనీ ఇంకా దీని ధరను వెల్లడించలేదు. కానీ అధికారిక సైట్‌లో Ulefone Armor 29 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. ఉలేఫోన్ ఆర్మర్ 29 ప్రో 5G థర్మల్ వెర్షన్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. Ulefone Armor 29 Pro 5G థర్మల్ వెర్షన్ సెప్టెంబర్ మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా ఫోన్ ధరను నిర్ధారించలేదు. కానీ త్వరలో వెల్లడి కావచ్చు. 

Ulefone Armor 29 Pro 5G Specs

Ulefone Armor 29 Pro 5G థర్మల్ వెర్షన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 2,200 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. దీనితో పాటు 1.04-అంగుళాల AMOLED సబ్ డిస్‌ప్లే అందించారు. ఇది 340x340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 21200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W ఫ్లాష్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అందించారు. Android 15లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 16GB RAM, 16GB ఎక్స్‌టెండెడ్ RAM ఉన్నాయి. అదే సమయంలో 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందించారు. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఆర్మర్ 29 ప్రో 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ వైడ్ మాక్రో కెమెరా, 64-మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ ID ఉంది. Ulefone Armor 29 Pro 5G ఫోన్ IP68/IP69K రేటింగ్, వాటర్ అండ్ డస్ట్ నుండి రక్షించడానికి MIL-STD-810H సర్టిఫైడ్ బాడీతో అమర్చబడి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, GPS, Wi-Fi 6E, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ C పోర్ట్ మరియు బ్లూటూత్ 5.4 ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు