/rtv/media/media_files/2025/08/08/gpt-5-2025-08-08-19-17-27.jpg)
GPT-5
GPT-5: OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్(Sam Altman) ఇటీవల చాట్‌జీపీటీ కొత్త వెర్షన్ GPT-5 గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ GPT-5 ఎంతో శక్తివంతమైన మోడల్, అనేక రంగాల్లో ఇది చాలా శక్తివంతగా పనిచేస్తోందని చెప్పారు. అయితే, ఎంత శక్తివంతమైనా అది 100% పర్ఫెక్ట్ కాదని ఆయన ఓ ఉదాహరణ ద్వారా తెలియజేశారు.
సోషల్ మీడియా వేదికగా ఒక యూజర్ GPT-5 (ChatGPT) కి సాధారణ గణిత ప్రశ్న వేసాడు - “19% of 450 is how much?” అని అడగగా. దీనికి GPT-5 ఇచ్చిన సమాధానం తప్పు. నిజానికి 19% of 450 అంటే 85.5 అవుతుంది. కానీ GPT-5 ఇచ్చిన సమాధానం 505 అని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతే కాదు, ఆ సమాధానం చివర్లో "Simple maths" అనే మెసేజ్ కూడా కనిపించడంతో, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సంఘటనపై సామ్ ఆల్ట్‌మాన్ స్పందిస్తూ, “ఇది సరే, తప్పు చేసింది. కానీ GPT-5 అనేది ఇప్పటికే చాలా విషయాల్లో దాని ప్రతిభ చూపించింది. దీని కంటే చాలా పెద్ద విషయాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు.
Also Read: ప్రతీది ChatGPTని అడిగేస్తున్నారా..? జాగ్రత్త మీ సంభాషణలు అందరూ చూసేస్తున్నారు..!
ఇంకా అభివృద్ధి అవసరం ఉందా?
GPT-5 అనేది మరింత మెరుగైన భవిష్యత్ టెక్నాలజీ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం. ఇది గత మోడల్స్‌తో పోలిస్తే మరింత సమర్థవంతంగా, తక్కువ తప్పులతో పనిచేస్తోంది. అయినా సరే, అల్గోరిథమ్స్ లో చిన్న తప్పులు, ముఖ్యంగా గణితంలో ఇలా జరగడం వలన యూజర్లలో ఇది సరైనదేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. AI మోడల్స్‌కి గణితంగా సరైన సమాధానం ఇవ్వడం సులభం కాదు, ఎందుకంటే అవి "లెర్నింగ్ డేటా"పై ఆధారపడి పనిచేస్తాయి - కచ్చితమైన లాజిక్‌ను ఫాలో అవ్వవు.
సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, "ఈ మోడల్ డాక్టర్లు, లాయర్లు, కోడర్స్, రైటర్లు వంటి అనేక వృత్తులలో ఉన్నవారికి సహాయం చేస్తోంది. మనిషికి అవసరమైన ప్రతీ విషయాన్ని నేర్చుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం," అని చెప్పారు. కానీ ఇంత చేస్తున్నా, ఇంకా చిన్నచిన్న లోపాలు రావడం వల్ల భవిష్యత్‌లో మరిన్ని అప్‌డేట్స్ అవసరం అని తెలుస్తోంది.
GPT-5 అనేది ఒక గొప్ప టెక్నాలజీ కి కొత్త అడుగు. అది నిపుణుల స్థాయిలో పని చేస్తున్నప్పటికీ, చిన్నపాటి గణిత లోపాలు ఇంకా పర్ఫెక్షన్ సాధించాల్సిన అవసరం ఉంది. దీని ప్రస్తుత పనితీరు బాగున్నప్పటికీ, ఇంకా మెరుగ్గా పని చేయాలంటే భవిష్యత్తులో మరిన్ని అప్‌డేట్స్ ఎంతైనా అవసరం ఉంది.