/rtv/media/media_files/2026/03/05/realme-narzo-power-5g-2026-03-05-15-50-16.jpg)
Realme Narzo Power 5G
ప్రముఖ టెక్ బ్రాండ్ Realme మార్కెట్‌లో దూసుకుపోతోంది. కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ అదరగొడుతోంది. తాజాగా కంపెనీ తన లైనప్‌లోని మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. Realme Narzo Power 5Gని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేకి ప్రసిద్ధి చెందింది. Realme Narzo Power 5G 6.8-అంగుళాల 144Hz హైపర్‌గ్లో 4D కర్వ్+ OLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, 10,001mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8GB RAM, ఆండ్రాయిడ్ 16-ఆధారిత రియల్‌మీ UI 7.0, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
Realme Narzo Power 5G Price
ఇక Realme Narzo Power 5G ధర విషయానికొస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ.27,999గా నిర్ణయించారు. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. కంపెనీ ప్రకారం.. మొదటి సేల్ ఆఫర్లలో రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్, అదనంగా రూ.1,000 తగ్గింపు ఉన్నాయి. ఈ ఆఫర్లతో Realme Narzo Power 5G ధరలు 128జీబీ వేరియంట్ రూ.23,999లకు, అలాగే 256జీబీ వేరియంట్ రూ.25,999లకు సొంతం చేసుకోవచ్చు.
ఇది మాత్రమే కాకుండా 6 నెలల నో-కాస్ట్ EMI ఉంది. అలాగే దాదాపు రూ.2,999కు 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీని కలిగి ఉంది. ఈ ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ కలర్‌లలో లభిస్తుంది. Realme Narzo Power 5G సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. దీనిని realme.com, Amazonలో కొనుక్కోవచ్చు.
Realme Narzo Power 5G Specifications
Realme Narzo Power 5G స్మార్ట్‌ఫోన్ 1280 × 2800 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HDR10+ సపోర్ట్, 6500 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ Realme UI 7.0 ఆధారంగా Android 16పై నడుస్తుంది. ఇది ట్రాన్స్‌వ్యూ డిజైన్‌ను కలిగి ఉంది. Realme Narzo Power 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 4nm ప్రాసెసర్‌తో మాలి G615 MC2 GPUతో పనిచేస్తుంది. ఇది హైపర్‌విజన్+ AI చిప్‌తో వస్తుంది. అంతేకాకుండా 90fps BGMI గేమింగ్‌కు మద్దతు ఇస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, టూ-యాక్సిస్ OIS ఉన్నాయి. దీంతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంది. ముందు కెమెరాలో 16-మెగాపిక్సెల్ సోనీ IMX480 కెమెరా అందించారు. 1080p వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా 4K 30fps వీడియో రికార్డింగ్, AI ల్యాండ్‌స్కేప్ వంటి AI ఫోటోగ్రఫీ మోడ్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 10,001mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అని కంపెనీ పేర్కొంది. ఇది నెక్స్ట్ జనరేషన్ సిలికాన్ కార్బన్ యానోడ్ టెక్నాలజీ, డ్యూయల్ లేయర్ కోటింగ్ ప్రాసెస్, సి ప్యాక్ ప్రొటెక్షన్ బోర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 55W PPS ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, IP66 + IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా కలిగి ఉంది.
Follow Us