/rtv/media/media_files/2025/11/10/numeros-n-first-electric-scooter-2025-11-10-16-59-24.jpg)
Numeros N-First Electric Scooter
ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ద్విచక్ర వాహన ప్రియులు డబ్బు ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో తమ మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.
Numeros N-First Electric Scooter
ప్రముఖ EV స్టార్టప్ న్యూమెరోస్ మోటార్స్ భారతదేశంలో ‘‘Numeros N-First ఎలక్ట్రిక్ స్కూటర్’’ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి . అవి- మ్యాక్స్, ఐ-మ్యాక్స్, ఐ-మ్యాక్స్+.- ఒక్కో వేరియంట్ వేర్వేరు పవర్, రేంజ్‌లను కలిగి ఉంది.
Numeros N-First electric scooter launched at Rs 64,999 (ex-showroom).
— HT Auto (@HTAutotweets) November 6, 2025
This introductory price is exclusive to first 1000 buyers.
What would you choose - Numeros N-First Scooter or iPhone 17?
[Numeros Motors, N-First, Electric Scooter, Newly Launched, HT Auto] pic.twitter.com/l1z5N08gNK
మాక్స్, ఐ-మ్యాక్స్ వేరియంట్‌లు రెండూ 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇవి 1.8 kW (పీక్) మోటారుతో శక్తిని పొందుతాయి. వీటికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 91 కి.మీ వరకు మైలేజీ అందిస్తాయి. మాక్స్, ఐ-మ్యాక్స్ వేరియంట్‌లు గరిష్టంగా గంటకు 55 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ఫుల్ ఛార్జింగ్ కావడానికి దాదాపు 5 నుండి 6 గంటలు పడుతుంది.
టాప్ వేరియంట్ ఐ-మ్యాక్స్+ వేరియంట్ పెద్ద 3 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 2.5 kW (పీక్) మోటార్‌తో వస్తుంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 109 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ స్కూటీ గరిష్టంగా గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఫుల్‌గా ఛార్జింగ్ కావడానికి 7గంటల నుంచి 8 గంటలు పడుతుంది.
Numeros N-First.. 16-అంగుళాల టైర్లను కలిగి ఉంది. అలాగే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ట్విన్ రియర్ షాక్‌లతో వస్తుంది. ఇది డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. Numeros N-First స్కూటర్ డిజైన్ వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. అయితే బ్యాటరీ ప్లేస్‌మెంట్ కారణంగా సీటు కింద స్టోరేజ్ తక్కువగా ఉంటుంది. ఇందులో LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్‌ఫోన్ మౌంట్, అండర్-ఫ్లోర్ లగేజ్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కాగా రైడింగ్ మోడ్‌లు వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. మ్యాక్స్, ఐ-మ్యాక్స్.. ఎకో, నార్మల్ సెట్టింగ్‌లతో వస్తాయి. అయితే ఐ-మ్యాక్స్+ స్పోర్ట్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రివర్స్ అసిస్ట్, దొంగతనం అలర్ట్‌లు, జియోఫెన్సింగ్, ఇమ్మొబిలైజర్ సిస్టమ్ కూడా ఉన్నాయి. Numeros N-First కోసం ఆల్రెడీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జనవరి 2026లో ప్రారంభమవుతాయి.
Follow Us