Nubia Z80 Ultra : బుర్రపాడు మొబైల్.. 7,200mAh బ్యాటరీతో డిజైన్ పిచ్చెక్కించింది బాబోయ్..!

స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం నుబియా Z80 అల్ట్రా చైనాలో విడుదలైంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారీ 7,200mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చింది. ఇది మూడు ప్రధాన వేరియంట్‌లలో (12GB/512GB, 16GB/512GB, 16GB/1TB) లభ్యం కానుంది.

New Update
Nubia Z80 Ultra launched

Nubia Z80 Ultra launched

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నుబియా తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Nubia Z80 Ultraను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ కంపెనీ Z సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్. ఇందులో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, పెద్ద 7,200mAh బ్యాటరీ, అప్‌గ్రేడ్ చేయబడిన కెమెరా సిస్టమ్ ఉన్నాయి. ఈ ఫోన్ డిజైన్ పరంగా దాని ముందున్న Z70 అల్ట్రాను పోలి ఉంటుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్‌ ను కలిగి ఉంటుంది. 

Nubia Z80 Ultra Price

Nubia Z80 Ultra ప్రస్తుతం చైనాలో సేల్ కు అందుబాటులో ఉంది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ వివిధ రాకాల స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 

12GB + 512GB మోడల్ ధర సుమారు రూ. 61,500.
16GB + 512GB వేరియంట్ ధర సుమారు రూ. 65,300.
16GB + 1TB వేరియంట్ ధర సుమారు రూ. 70,200గా కంపెనీ నిర్ణయించింది. 

వీటితో పాటు స్టార్రీ నైట్ కలెక్టర్స్ ఎడిషన్, లువో టియాన్యి లిమిటెడ్ ఎడిషన్ వంటి ప్రత్యేక ఎడిషన్లు కూడా విడుదల అయ్యాయి. 

Nubia Z80 Ultra specs

Nubia Z80 Ultra స్మార్ట్ ఫోన్ 6.85-అంగుళాల BOX X10 OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 960Hz టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ప్యానెల్ 2592Hz PWM డిమ్మింగ్, 100% DCI-P3 కలర్ గామట్‌కు మద్దతు ఇస్తుంది.

పనితీరు కోసం.. ఇది కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC ని కలిగి ఉంది. Nubia Z80 Ultra ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా నెబ్యులా AIOS 2పై నడుస్తుంది. లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ ప్రత్యేకమైన HD వాల్‌పేపర్‌లు, కస్టమ్ యానిమేషన్‌లు, ప్రత్యేకమైన ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఎఫెక్ట్‌లతో వస్తాయి.

ఈసారి కెమెరా సెటప్ కూడా అప్‌గ్రేడ్ అయింది. ఈ ఫోన్‌లో 50MP 1/1.3-అంగుళాల ఓమ్నివిజన్ లైట్‌మాస్టర్ 990 ప్రధాన సెన్సార్ OIS, f/1.5 ఎపర్చర్‌తో ఉంటుంది. దీంతో పాటు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా (120° FOV, f/1.8), 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (15cm మాక్రో, OIS, f/2.4) ఉన్నాయి.

Nubia Z80 Ultra 90W వైర్డు, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద 7,200mAh బ్యాటరీతో వస్తుంది. రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో WiFi 7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ USB టైప్-C 3.2 Gen 1 పోర్ట్‌లు, ప్రత్యేకమైన USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు