/rtv/media/media_files/2025/09/30/motorola-g96-5g-discount-on-flipkart-big-billion-days-sale-2025-2025-09-30-16-21-35.jpg)
MOTOROLA G96 5G Discount On Flipkart Big Billion Days Sale 2025
Flipkart Big Billion Days Sale 2025లో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం Motorola అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తన Motorola G96 5G మొబైల్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. MOTOROLA G96 5Gలో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది pOLED కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 50MP కెమెరా, 5,500mAh బ్యాటరీతో వస్తుంది. దీంతో మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
MOTOROLA G96 5G Offers
ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA G96 5G ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.17,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.14,999 లకే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.3000 తగ్గింపు లభిస్తుందన్నమాట.
అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీనిని కేవలం రూ.16,999 కి సొంతం చేసుకోవచ్చు.
MOTOROLA G96 5G Bank Offers
తగ్గింపు ధరలతో పాటు వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లు కూడా లభిస్తాయి. దీని ద్వారా ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. దాదాపు రూ.12,090 వకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఇది మరింత తక్కువకే దొరుకుతుంది.
Motorola G96 5G Specs
Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రీఫ్రెష్ రేటుతో వస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ అందించారు. ఇది IP68 ప్రొటెక్షన్‌తో వచ్చింది. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీని కలిగి ఉంది. Motorola G96 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA 700C (OIS సపోర్ట్‌తో) ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్/మాక్రో సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Motorola G96 5Gలో 33W టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh సామర్థ్యం గల బ్యాటరీని ఇచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.