/rtv/media/media_files/2025/07/23/moto-g86-power-launch-date-2025-07-23-20-23-44.jpg)
Moto G86 Power Launch Date
Moto G86 Power స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. ఇదే విషయాన్ని కంపెనీ బుధవారం ప్రకటించింది. Motorola నుండి రాబోయే ఈ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7400 SoC ప్రాసెసర్ అందించారు. ఇది Android 15 పై నడుస్తుంది. 256GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది. 33W ఛార్జింగ్ సపోర్టుతో 6,720mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు దీని ధర, ఇతర ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Moto G86 Power Launch Date
రాబోయే Moto G86 Power స్మార్ట్‌ఫోన్ జూలై 30న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుగు అందుబాటులో ఉంటుంది. ఇది మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అందులో కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్, స్పెల్‌బౌండ్ కలర్ అందుబాటులో ఉన్నాయి.
Unfold a world of brilliance with the moto g86 POWER, featuring the segment’s best 1.5K pOLED display.
— Motorola India (@motorolaindia) July 23, 2025
All this, backed by a massive 6720mAh battery, delivering up to 53 hours of power.
🚀 Launching July 30 on Flipkart.
Moto G86 Power Specs
Moto G86 Power స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7400 SoC తో అమర్చబడి ఉంటుంది. ఇది 8GB ర్యామ్+ 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించవచ్చు.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
Moto G86 Power ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. Moto G86 Powerలో సోనీ LYT-600 సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మాక్రో మోడ్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. ఇందులో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. అలాగే Moto G86 Powerలో 6,720mAh బ్యాటరీని అమర్చారు. ఇది 33W టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.