Moto G06 Power Price: మోటో మావ కుమ్మేశాడు.. రూ.7,499కే 50MP కెమెరా ఫోన్ లాంచ్ - ఫీచర్లు హైలైట్

Moto G06 Power తాజాగా ఇండియాలో లాంచ్ అయింది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. ఇది 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7,000mAh బ్యాటరీతో వస్తుంది. త్వరలో దీని సేల్స్ ప్రారంభం కానుంది.

New Update
Moto G06 Power Price

Moto G06 Power Price

Motorola తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G06 Powerను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ అందించారు. 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. Moto G06 Power ఫోన్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.88-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లున్నాయి. ఇప్పుడు Moto G06 Power ఫీచర్లు, దాని స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Moto G06 Power Price

Moto G06 Power స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ పాంటోన్ లారెల్ ఓక్, పాంటోన్ టెండ్రిల్, పాంటోన్ టేపస్ట్రీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. త్వరలో దీని సేల్స్ Flipkart, Motorola అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతాయి. 

Moto G06 Power Specifications

Moto G06 Power ఫోన్ 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 720x1640 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా సేఫ్టీ పొందింది. Moto G06 Power స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో UIపై నడుస్తుంది. మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM + 64GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. Moto G06 Power స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. 

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Moto G06 Power వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే.. ఇది 4G LTE ఫోన్. Wi-Fi, బ్లూటూత్ 6.0, GPS, గ్లోనాస్, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అందించారు. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. Moto G06 Power సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లు, ప్లాస్టిక్ ఫ్రేమ్, వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది.

Advertisment
తాజా కథనాలు