/rtv/media/media_files/2025/09/17/flipkart-mobile-offers-2025-09-17-11-27-55.jpg)
Flipkart Mobile Offers
ఒక మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ యూజ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రస్తుతం టెక్ బ్రాండ్‌లు తమ మోడళ్లను దాదాపు రూ.30 వేలకు పైగానే ధరలతో లాంచ్ చేస్తుండటంతో చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ.10 వేలలోపే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy F06 5G
ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy F06 5G స్మార్ట్‌ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది. Samsung Galaxy F06 5G అసలు ధర రూ.12,499 ఉండగా.. ఇప్పుడు 24 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,499 లకే సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్‌కు వర్తిస్తుంది. ఇది 50ఎంపీ + 2ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
REDMI 13C 5G
ఫ్లిప్‌కార్ట్‌లో REDMI 13C 5G స్మార్ట్‌ఫోన్ కూడా తక్కువ ధరకు లభిస్తుంది. దీని 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఇప్పుడు కేవలం రూ.9999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై రూ.7,500 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే REDMI 13C 5G ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇది 50ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
Infinix Hot 50 5G
ఫ్లిప్‌కార్ట్‌లో Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ కూడా రూ.10వేల లోపే అందుబాటులో ఉంది. దీని 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఇప్పుడు 23 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. Infinix Hot 50 5G కూడా రూ.7,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఇది 48ఎంపీ డెప్త్ సెన్సార్ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
Follow Us