New Smartphone: బుర్రపాడు.. రూ.7వేలకే కొత్త 5జీ ఫోన్ లాంచ్.. ఫీచర్లు మైండ్‌‌ బ్లోయింగ్ భయ్యా..!

భారతదేశంలో లావా సంస్థ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Lava Bold N1 5Gని తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4GB+64GB వేరియంట్ ధర రూ.7,499గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 4GB+128GB వేరియంట్ ధర రూ.7,999గా ఉంది.

New Update
Lava Bold N1 5G smartphone launched

Lava Bold N1 5G smartphone launched

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లు, అద్భుతమైన ఆఫర్లతో కంపెనీ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తన తదుపరి మొబైళ్లను స్లిమ్‌గా అట్రాక్ట్ చేసే విధంగా తీసుకొచ్చి మరింత మందిని సర్‌ప్రైజ్ చేస్తోంది. ఇందులో భాగంగానే లావా కంపెనీ తాజాగా తన కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్ Lava Bold N1 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.

కేవలం రూ.8 వేల కంటే తక్కువ ధరకు లభించే ఈ 5G స్మార్ట్‌ఫోన్ 6.75-అంగుళాల HD + నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో ఈ Lava Bold N1 5G ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఇప్పుడు Lava Bold N1 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.

Lava Bold N1 5G Price

Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లను కలిగి ఉంది. అందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7499గా కంపెనీ నిర్ణయింది. అయితే దీనిపై రూ.750 బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ తర్వాత దీనిని కేవలం రూ.6749 కు కొనుగోలు చేయవచ్చు. 

అదే సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7999గా ఉంది. దీనిపై కూడా రూ.750 బ్యాంక్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ తర్వాత దీనిని రూ.7249 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ షాంపైన్ గోల్డ్, రాయల్ బ్లూ కలర్‌లలో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌పై 1 సంవత్సరం వారంటీని అందిస్తుంది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. 

Lava Bold N1 5G specs

Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ 6.75-అంగుళాల HD + నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ UNISOC T765 ప్రాసెసర్ అందించారు. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కంపెనీ 3 సంవత్సరాల పాటు రెండు Android అప్‌గ్రేడ్‌లు, సెఫ్టీ అప్‌డేట్‌లను హామీ ఇస్తుంది. 

అదే విధంగా కెమెరా సెటప్ విషయానికొస్తే.. Lava Bold N1 5G వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ AI కెమెరా ఉంది. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 5-మెగాపిక్సెల్ ముందు కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 4GB RAM ఉండగా.. దీనిని వర్చువల్ RAM ద్వారా అదనంగా 4GB పెంచవచ్చు. అదే సమయంలో 64GB / 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందించగా.. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే.. 5G, Wi-Fi, బ్లూటూత్ 4.2, OTG వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. అమర్చబడింది. Lava Bold N1 5Gలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ అందించారు.

Advertisment
తాజా కథనాలు