Jio Cheapest Recharge Plan: రూ.40లకే 9GB డేటా.. జియో యూజర్లకు పండగే

టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్లకు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. కేవలం రూ.40లతో రీఛార్జ్ చేసుకుంటే 3రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఇందులో రోజుకు 3జీబీ డేటా వస్తుంది. అంటే మూడు రోజులకు 9జీబీ డేటా పొందొచ్చు. ఇది డేటా ప్లాన్ మాత్రమే.

New Update
Jio Cheapest Recharge Plan

Jio Cheapest Recharge Plan

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. ప్రతి చిన్న పని కోసం ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇదొక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో స్ట్రీమింగ్స్, డాక్యుమెంట్స్ డౌన్‌లోడింగ్ వంటి ఎన్నో కార్యకలాపాలను డేటా ద్వారానే పొందుతున్నారు. అందులోనూ ఇప్పుడంతా అన్‌లిమిటెడ్ డేటా వచ్చేయడంతో.. ఇంటర్నెట్‌ వినియోగానికి అడ్డులేకుండా పోయింది. కాగా ఒక్కోసారి రోజువారీ డేటా లిమిట్ అయిపోయినపుడు అది అతి పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో సకాలంలో చేసుకోవలసిన పనులు ఆగిపోతాయి. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో డేటా అవసరమైతే ప్రముఖ టెలికాం సంస్థ తన యూజర్ల కోసం అదిరిపోయే డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Jio Cheapest Recharge Plan

Jio తన యూజర్ల కోసం రూ.40 డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఇది మూడు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 3జీబీ డేటా పొందుతారు. దీని బట్టి మూడు రోజులకు మొత్తం 9జీబీ హైస్పీడ్ డేటాను యూజర్లు పొందుతారు. ఆన్‌లైన్ క్లాస్ లేదా ప్రాజెక్ట్, ప్రయాణంలో తక్కువ రోజులకు ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ సరైనది. 

ఈ ప్లాన్‌ను నేరుగా MyJio యాప్‌లో లేదా Jio అఫీషియల్ వెబ్‌సైట్‌లో డేటా యాడ్-ఆన్ విభాగంలో ఉంటుంది. కాగా ఇక్కడ యూజర్లు ఒక్క విషయం గమనించాలి. ఈ ప్లాన్ ప్రస్తుత బేస్ ప్లాన్ చెల్లుబాటును పొడిగించదు. ఇది మీ డేటా అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉద్దేశించబడింది.

ఎయిర్‌టెల్ డేటా ప్లాన్

అదే సమయంలో ఎయిర్‌టెల్ రూ.33లతో డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఇది జియో కంటే తక్కువ వ్యవధిని అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక రోజు మాత్రమే చెల్లుబాటుతో 2GB డేటాను అందిస్తుంది. అంటే డేటా ప్యాక్‌ను యాక్టివేట్ చేసిన రోజు మాత్రమే చెల్లుతుంది. 

కాగా జియో తన జియోఫోన్ (JioPhone) వినియోగదారుల కోసం రూ.75 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 23 రోజుల వాలిడిటీతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 50 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తం 2.5 జీబీ డేటా (రోజుకు 0.1 జీబీ + 200 ఎంబీ అదనంగా) వస్తుంది.

సాధారణ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ వాలిడిటీ కావాలనుకునేవారికి రూ.189 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 2 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

డేటా మాత్రమే అవసరం అనుకునేవారికి రూ.77 ప్లాన్ ఉంది. ఇందులో 3 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.100 లకు 5 జీబీ డేటా పొందొచ్చు. ఈ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు కూడా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి ఈ బడ్జెట్ ప్లాన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు