ISRO మరో రికార్డ్.. నింగిలోకి దూసుకెళ్లిన బహుబలి రాకెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. అత్యంత భారీ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో 'బాహుబలి' గా పేరుగాంచిన LVM3 రాకెట్ నేడు (బుధవారం) ఒక చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది.

author-image
By K Mohan
New Update
Screenshot 2025-12-24 095847

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి బుధవారం చేపట్టిన బాహుబలి రాకెట్‌ ‘ఎల్‌వీఎం3-ఎం6’ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 8.45నిమిషాలకు రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఈ ప్రయోగంలో సుమారు 6,100 కిలోల (6.1 టన్నులు) బరువున్న బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. ఇది ఇస్రో చరిత్రలోనే ఒక భారీ పేలోడ్. ఈ శాటిలైట్ ప్రధానంగా ప్రపంచవ్యాప్త 5G సెల్యులార్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా సాటిలైట్ ద్వారా సిగ్నల్స్ అందించడం దీని ప్రత్యేకత. 'బాహుబలి'గా పిలిచే LVM3 రాకెట్ మూడు దశల ప్రయోగ వాహనం. ఇది భారీ ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో అత్యంత నమ్మకమైనది.

బ్లూబర్డ్ బ్లాక్ 2 స్పెషాలిటి

ఈ ఉపగ్రహాలు ప్రధానంగా గ్లోబల్ కనెక్టివిటీ, డైరెక్ట్-టు-సెల్ సాంకేతికతను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి. మారుమూల ప్రాంతాల్లో, సిగ్నల్స్ లేని చోట కూడా నేరుగా మొబైల్ ఫోన్లకు 5G ఇంటర్నెట్ మరియు కాలింగ్ సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ఉపగ్రహాల్లో అత్యంత భారీ, అధునాతనమైన యాంటెన్నాలను అమర్చారు. ఇవి అంతరిక్షం నుండి భూమిపై ఉన్న చిన్న మొబైల్ సిగ్నళ్లను కూడా సులభంగా క్యాచ్ చేయగలవు. 

మారుమూల ప్రాంతాలు, సముద్ర జలాలు, విమాన ప్రయాణాల్లో కూడా నెట్‌వర్క్ అంతరాయం లేకుండా 4G, 5G సేవలను ఈ ప్రయోగం అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమెరికాకు చెందిన AST SpaceMobile సంస్థతో కలిసి చేపడుతున్నారు. ఇది భారత్-అమెరికా అంతరిక్ష వాణిజ్య సంబంధాలను బలపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగం జరుగుతుంది. ఈ ఉపగ్రహంలో 223 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన భారీ యాంటెన్నా ఉంటుంది. కక్ష్యలోకి వెళ్లిన తర్వాత ఇది విచ్చుకుని సేవలను ప్రారంభిస్తుంది. గతంలో భారీ ఉపగ్రహాల కోసం భారత్ విదేశీ రాకెట్లపై ఆధారపడేది. ఇప్పుడు స్వదేశీ బాహుబలి రాకెట్ ద్వారా ప్రయోగించడం వల్ల భారీగా ఖర్చు తగ్గుతుంది. ఇదే LVM3 రాకెట్‌ను భవిష్యత్తులో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే 'గగన్‌యాన్' మిషన్ కోసం కూడా ఉపయోగించనున్నారు. LVM3 సిరీస్‌లో 9వ మిషన్, ఇస్రో చేపడుతున్న 100కు పైగా ప్రయోగాల్లో అత్యంత కీలకమైనదిగా నిలవనుంది.

Advertisment
తాజా కథనాలు