New smartphone: రచ్చలేపిన కొత్త ఫోన్.. 200mp కెమెరా, 7,200 mAh బ్యాటరీతో పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు

హానర్ కంపెనీ తన Honor Magic 8, Honor Magic 8 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అజూర్ గ్లేజ్, స్నో వైట్, సన్‌రైజ్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. 

New Update
Honor Magic 8, Honor Magic 8 Pro

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ బుధవారం Honor Magic 8 సిరీస్ ను లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. అవి Honor Magic 8, Honor Magic 8 Pro. ఈ స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. 

Honor Magic 8 price

12GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 55,600.
12GB + 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 59,000.
16GB + 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 61,700. 
16GB + 1 TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 67,900 గా ఉంది. 

ఈ స్మార్ట్‌ఫోన్ అజూర్ గ్లేజ్, స్నో వైట్, సన్‌రైజ్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. 

Honor Magic 8 specs

Honor Magic 8  స్మార్ట్‌ఫోన్ దాని ప్రాసెసర్, ఫ్రంట్ కెమెరా, సాఫ్ట్‌వేర్ సహా కొన్ని లక్షణాలను కలిగి ఉంది. హానర్ మ్యాజిక్ 8.. 6.58-అంగుళాల ఫుల్ HD+ (1,256 x 2,760 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్  వరకు ఉంటుంది. 6,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 100x ఆప్టికల్ జూమ్‌తో 64-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. Honor Magic 8.. 90 W వైర్డు, 80 W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. 

Honor Magic 8 Pro price 

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,300.
12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 74,000. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 76,500. 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ రూ. 82,700గా కంపెనీ నిర్ణయించింది. 

ఈ స్మార్ట్‌ఫోన్ కూడా అజూర్ గ్లేజ్, స్నో వైట్, సన్‌రైజ్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.  

Honor Magic 8 Pro specs

Honor Magic 8 Pro డ్యూయల్-కెమెరా స్మార్ట్‌ఫోన్ 6.71-అంగుళాల 1.5K (1,256 x 2,808 పిక్సెల్స్) LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 6,000 nits వరకు ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా మ్యాజిక్ OS 10 పై నడుస్తుంది. Honor Magic 8 Pro ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 100x డిజిటల్ జూమ్‌తో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,200 mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. 

Advertisment
తాజా కథనాలు