/rtv/media/media_files/2025/11/12/hero-splendor-price-2025-11-12-19-06-57.jpg)
Hero Splendor
భారత మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీలోని ద్విచక్ర వాహనాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త కొత్త మోడళ్లలో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇప్పుడు కంపెనీకి చెందిన మరొక మోడల్ అందరినీ ఆకర్షించింది. టీవీఎస్ కంపెనీకి చెందిన TVS Radeon అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతోంది.
ఇది ఒక 110cc కమ్యూటర్ బైక్. రోజువారీ ప్రయాణానికి సరైనదని కంపెనీ చెబుతోంది. ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా.. సరసమైన ధర, అధిక మైలేజీని అందిస్తుంది. కంపెనీ దీనిని కేవలం రూ.55,100 (ఎక్స్ షోరూమ్) ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
TVS Radeon Specs
TVS Radeon ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో LED DRLతో కూడిన మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్‌లను అందించారు. అలాగే రెండు టైర్లు సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీని కలిగి ఉంది.
TVS Radeon 113-115 కిలోలు (వేరియంట్‌ను బట్టి) బరువు ఉంటుంది. ఇంధన ట్యాంక్ 10 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. సస్పెన్షన్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇవి బంప్స్‌పై కుషనింగ్‌ను అందిస్తాయి. బేస్ మోడల్‌లో ముందు భాగంలో 130mm డ్రమ్, వెనుక భాగంలో 110mm డ్రమ్ బ్రేకింగ్‌ను కలిగి ఉంది. టాప్ వేరియంట్ ముందు భాగంలో 240mm డిస్క్ బ్రేక్‌ను పొందుతుంది. ఇది ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది.
TVS Radeon 109.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది డ్యూరలైఫ్ టెక్నాలజీని కలిగి ఉంది. అంతేకాకుండా BS6 ఫేజ్ 2 కంప్లైంట్, ET-Fi ఫ్యూయల్ ఇంజెక్షన్‌ను కలిగి ఉంది. ఇది 8.08 bhp (6.03 kW) పవర్ అవుట్‌పుట్, 8.7 Nm టార్క్‌తో వస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌తో 68.6 నుండి 73.68 km/l వరకు మైలేజీ అందిస్తుంది.
అలాగే USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, పాస్ లైట్, ప్రమాద హెచ్చరిక అలర్ట్, పిలియన్ గ్రాబ్ పట్టాలు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ఎకో ఇండికేటర్, ఇంధన గేజ్‌ను కూడా కలిగి ఉంటుంది. TVS Radeon సీటు పొడవుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది లాంగ్ రైడ్‌లకు అనువైనదిగా చేస్తుంది. ఇందులో మెటల్ బ్లాక్, రాయల్ పర్పుల్, టైటానియం గ్రే, స్టార్‌లైట్ బ్లూ, బ్లూ అండ్ బ్లాక్ కలర్లు ఉన్నాయి.
Follow Us