X AI Grok: గ్రోక్ దెబ్బకు చాట్ జీపీటీ వెనక్కు..

మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే.  ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది. 

New Update
AI grok musk

AI grok musk Photograph: (AI grok musk)

ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అని మహేష్ బాబు డైలాగ్. కానీ ఇప్పుడు దీన్ని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. దీనికి కారణం ట్విట్టర్లో ప్రవేశపెట్టిన ఏఐ టూల్   Grok కారణం. ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా  Grokని తెగ వాడుతున్నారు. Grok ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొదటి చాట్బాట్ అయిన Open AI ChatGPTని దాటేసింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

ఆండ్రాయిడ్ లో నంబర్ వన్ పొజిషన్..

మైక్రో బ్లాగింగ్ లో ఎక్స్ ప్లాట్ ఫామ్ ఎప్పుడూ నంబర్ వన్ పొజిషన్ లోనే ఉంటుంది. ఇప్పుడు  xAI ద్వారా AI చాట్‌బాట్ అయిన గ్రోక్ కూడా టాప్ అయింది. ఆండ్రాయిడ్ యాప్ లో నంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చింది. TikTok ,ChatGPTలను అధిగమించింది. ఇవి 4.1,4.8 తక్కువ రేటింగ్ పొందగా..గ్రోక్ మాత్రం వీటి కంటే ఎక్కువ రేటింగ్ ను సాధించింది. 

today-latest-news-in-telugu | chat-gpt | grok ai | elon-musk

Also Read: IPL 2025: చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలుపు

Advertisment
తాజా కథనాలు