/rtv/media/media_files/2026/03/06/smart-tv-offers-2026-03-06-17-47-37.jpg)
smart tv offers
smart tv offers: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై దుమ్ములేపే ఆఫర్లు నడుస్తున్నాయి. అతి తక్కువ ధరకే వీటిని కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు. ఇంకా మరింత డిస్కౌంట్ కోసం బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. సమ్మర్ సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ టీవీలపై డిస్కౌంట్లు అందిస్తుంది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Coocaa Tv
ఫ్లిప్‌కార్ట్‌లో 32 ఇంచుల Coocaa S4U Plus 32 inch HD Ready LED Smart Coolita TV అతి తక్కువ ధరకే లభిస్తోంది. దీని అసలు రూ.13,999 ఉండగా ఇప్పుడు 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,699లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 950 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే 1900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.
Coocaa Tv Specs
Coocaa Tv 32 ఇంచులతో, LED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది కూలిటా ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 30వాట్స్ డాల్బీ ఆడియో స్పీకర్లు ఉన్నాయి. ఇది HD రెడీ (1366 * 768 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 400 నిట్స్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో 2డౌన్ ఫైరింగ్ స్పీకర్లున్నాయి. ఇది 4జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. యూట్యూబ్, ప్రైమ్ వీడియో సపోర్టు చేస్తుంది.
Vw LED TV 2025 Edition
ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో చీపెస్ట్ టీవీ Vw LED TV 2025 Edition. 24 ఇంచులు కలిగిన ఈ టీవీ అసలు ధర రూ.11,000గా ఉంది. ఇప్పుడు దీనిని 51 శాతం తగ్గింపు ధరతో కేవలం రూ.5,399లకే సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై రూ.540 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Vw LED TV 2025 Edition Specs
ఇది స్మార్ట్‌టీవీ కాదు. ఇందులో ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఈ టీవీ HD రెడీ (1366 x 768 పిక్సెల్స్) రెజల్యూషన్‌ను కలిగి ఉంది. 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 20 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ ఇస్తుంది.
Follow Us