/rtv/media/media_files/2025/09/26/flipkart-mobile-offers-2-2025-09-26-15-15-58.jpg)
Flipkart Mobile Offers
Flipkart Big Billion Days Sale 2025లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, గృహోపకరణాలు మొదలైన వాటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో మీరు కేవలం స్మార్ట్‌ఫోన్లను రూ. 15,000 బడ్జెట్‌లో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన అవకాశం. ఈ సంవత్సరం లాంచ్ అయిన CMF Phone 2 Pro మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.
పండుగ సీజన్ సందర్భంగా సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ సేల్‌లో CMF Phone 2 Proపై భారీ ధర తగ్గింపును పొందవచ్చు. అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు. CMF Phone 2 Proలో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, డిస్కౌంట్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
CMF Phone 2 Pro Price & Offers
CMF Phone 2 Pro లోని 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఏప్రిల్ 2025లో రూ.18,999కి లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ల గురించి మాట్లాడుకుంటే.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,500 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర రూ.14,499 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.12,050 వరకు తగ్గించవచ్చు. ఇది మొత్తం వర్తిస్తే CMF Phone 2 Proను కేవలం రూ.2,449లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం ప్రయోజనం పొందాలంటే పాత ఫోన్ మోడల్, దాని స్థితిపై ఆధారపడి ఉంటుంది.
CMF Phone 2 Pro Specs
CMF Phone 2 Pro ఫీచర్ల విషయానికొస్తే.. 6.77-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2392 పిక్సెల్ రిజల్యూషన్, 2160Hz PWM ఫ్రీక్వెన్సీ, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ CMF Phone 2 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.2 పై నడుస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో.. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. CMF Phone 2 Proలో EIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.