/rtv/media/media_files/2025/09/22/gst-cars-2025-09-22-15-06-30.jpg)
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీఎస్టీ 2.0 విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం ఆటోమొబైల్స్, వాటి విడిభాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనితో కార్లు, బైక్‌ల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే చిన్న కార్లు, 350సీసీ లోపు బైక్‌లపై ఈ తగ్గింపు ప్రభావం అధికంగా ఉంది. దసరా, దీపావళి వంటి పండుగల సీజన్‌కు ముందు ఈ నిర్ణయం వాహన రంగంలో కొత్త జోష్ తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ధర తగ్గిన కార్లు, తగ్గిన ధరలు (అంచనా):
మారుతి సుజుకి: మారుతి కార్ల ధరలు రూ. 40 వేల నుంచి రూ. 2.25 లక్షల వరకు తగ్గాయి. ఆల్టో కే10పై రూ. 1.07 లక్షలు, స్విఫ్ట్ పై రూ. 58 వేలు, డిజైర్ పై రూ. 61 వేలు, బ్రెజ్జాపై రూ. 78 వేలు తగ్గాయి.
టాటా మోటార్స్: టాటా కార్ల ధరలు రూ. 65 వేల నుంచి రూ. 1.55 లక్షల వరకు తగ్గాయి. నెక్సాన్ పై రూ. 1.55 లక్షలు, హారియర్, సఫారీ మోడల్స్ పై రూ. 1.4 లక్షల వరకు తగ్గింపు లభించింది.
మహీంద్రా: మహీంద్రా ప్రముఖ మోడళ్లపై రూ. 1.27 లక్షల నుంచి రూ. 1.56 లక్షల వరకు ధరలు తగ్గాయి. ఎక్స్ యూవీ 3ఎక్స్ఓపై రూ. 1.56 లక్షలు, థార్ పై రూ. 1.35 లక్షలు, స్కార్పియో క్లాసిక్, ఎన్ మోడల్స్ పై రూ. 1 లక్షకు పైగా తగ్గింపు ఉంది.
హ్యుండాయ్: హ్యుండాయ్ ఐ10, ఔరా, క్రెటా వంటి పాపులర్ మోడళ్లపై రూ. 70 వేల వరకు తగ్గింపు లభించింది.
కియా: కియా కార్లపై రూ. 4.48 లక్షల వరకు ధరలు తగ్గాయి. కార్నివాల్ పై రూ. 4.48 లక్షలు, సోనెట్ పై రూ. 1.64 లక్షలు, సెల్టోస్ పై రూ. 75,372 తగ్గింపు ఉంది.
లగ్జరీ కార్లు: లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. ల్యాండ్ రోవర్ కార్లపై రూ. 30 లక్షల వరకు, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ పై రూ. 10 లక్షల వరకు, బీఎండబ్ల్యూ కార్లపై రూ. 13.6 లక్షల వరకు తగ్గింపు లభించింది.
ధర తగ్గిన బైక్‌లు:
350సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌ల జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనితో హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలకు చెందిన బడ్జెట్ బైక్‌ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ నిర్ణయంతో వినియోగదారులు వేల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం లభించింది. హోండా టూ-వీలర్లపై రూ. 18,800 వరకు, హీరో బైక్‌లపై రూ. 15,743 వరకు తగ్గింపు లభించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350పై దాదాపు రూ. 20 వేల వరకు తగ్గింపు లభించింది. ఈ పన్ను తగ్గింపు వాహన రంగంలో అమ్మకాలకు ఊపునిస్తుందని భావిస్తున్నారు.