/rtv/media/media_files/2024/12/31/oviDILSXlaWfxd1LT04L.jpg)
Cheapest Recharge Plan
ప్రముఖ ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన వినియోగదారుల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లు అందించి అదరగొడుతోంది. ఇప్పటికే పలు రకాల ప్లాన్‌లతో యూజర్లను ఆకట్టుకుంది. ఇప్పుడు మరొక సర్‌ప్రైజ్ అందించింది. BSNL బాలల దినోత్సవం కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను ప్రవేశపెట్టింది.
చిల్డ్రన్స్ డే సందర్భంగా కంపెనీ అత్యంత చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. BSNL కంపెనీ ప్రత్యేకంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు ఎక్కువ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందిస్తుంది. ఈ ప్లాన్ చాలా సరసమైన ధరకు అపరిమిత డేటా, కాలింగ్‌ను అందిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BSNL కొత్త ప్లాన్:
BSNL తన కస్టమర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.251లకే ఈ ప్లాన్ ధర ఉంటుంది. ఇందులో విద్యార్థుల అవసరాలను తీర్చడానికి కంపెనీ ప్రత్యేకంగా దీనికి ‘‘స్టూడెంట్ ప్లాన్’’ అనే పేరు పెట్టింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా కంపెనీ తన సోషల్ మీడియా ద్వారా ఈ ప్లాన్‌ను ప్రారంభించింది.
Empowering every young mind with strong connectivity at smarter value#SwitchToBSNL Student Special Plan @ ₹251 and enjoy Unlimited Calls, 100GB Data & 100 SMS/Day for 28 days.#BSNLLearnerPlan#ConnectingBharatpic.twitter.com/HRIAw4CWMN
— BSNL India (@BSNLCorporate) November 14, 2025
BSNL రూ. 251 ప్లాన్ ప్రయోజనాలు
BSNLలోని రూ. 251 ప్లాన్ ధరకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్ 100GB డేటా పొందుతారు. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది. దీంతో పాటు ఈ ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 100 ఉచిత SMS సౌకర్యాన్ని కూడా అందించింది. అంటే ఇది ఇంటర్నెట్, కాలింగ్, మెసేజింగ్‌తో సహా అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
డిసెంబర్ 14 వరకు ఆఫర్
ఈ ప్లాన్ ఆఫర్ నవంబర్ 14 నుండి డిసెంబర్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల వినియోగదారులు డిసెంబర్ 14కి ముందే రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్‌టెల్, జియో, Viతో పోలిస్తే.. ఈ ప్లాన్ సరసమైన ధరకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అర్హత కలిగిన కస్టమర్‌లు తమ సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా ఈ స్టూడెంట్ ప్లాన్‌ను సొంతం చేసుకోవచ్చు. లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ bsnl.co.inని కూడా సందర్శించి రీఛార్జ్ చేసుకోవచ్చు.
Follow Us