/rtv/media/media_files/2025/11/16/best-mileage-bikes-2025-11-16-16-52-22.jpg)
Best Mileage Bikes
దేశీయ మార్కెట్‌లో టూ వీలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి ప్రజలు అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లనే ఇష్టపడుతున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తక్కువ ధరలోనే బెస్ట్ మైలేజ్ అండ్ అధునాతన ఫీచర్లు కలిగిన కొత్త కొత్ బైక్‌లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నారు. మరి మీరు కూడా లో కాస్ట్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం. మార్కెట్‌లో TVS కంపెనీకి చెందిన మూడు బైక్‌లు అద్భుతమైన మైలేజీ ఇస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
TVS Radeon
TVS Radeon 2025 అత్యంత సరసమైన బైక్. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ.55,100 (ఆల్ బ్లాక్ ఎడిషన్)గా కంపెనీ నిర్ణయించింది. దీని టాప్ వేరియంట్ రూ.77,900 నుంచి మొదలవుతుంది. 109.7cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 8.08 bhp మరియు 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 73.68 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది మొత్తం 10-లీటర్ ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. ఇందులో USB ఛార్జర్, LED DRL హెడ్‌ల్యాంప్‌లు, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (SBT), పొడవైన సీటు, 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది.
TVS Sport
TVS Sport 2025 బైక్ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీని ES వేరియంట్ ధర రూ.55,100 ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ రూ.57,100 వరకు ఉంటుంది. 109.7cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 8.19 PS పవర్ మరియు 8.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఎకానమీ ఇండికేటర్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, ట్యూబ్‌లెస్ టైర్లు, 5 సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
TVS Star City Plus
TVS Star CityPlus 2025 బైక్ డ్రమ్ వేరియంట్ రూ.72,200 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీని డిస్క్ వేరియంట్ ధర రూ.74,900 వరకు ఉంటుంది. 109.7cc EcoThrust ఇంజిన్‌తో వస్తుంది. 8.08 bhp, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ పరంగా.. లీటర్ పెట్రోల్‌కు 83.09 కి.మీ మైలేజీ అందిస్తుంది. LED హెడ్‌ల్యాంప్, USB ఛార్జర్, 5-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, SBT బ్రేకింగ్, 5 సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్లున్నాయి.
Follow Us