Best AI Tools for Students: మీ జీవితాన్ని మార్చేసే బెస్ట్ AI టూల్స్ ఇవే..!

స్కూల్ స్టూడెంట్స్ ఇంటెలిజెంట్స్ గా మారాలంటే తప్పక ఉపయోగించాల్సిన 7 బెస్ట్ AI టూల్స్‌ ఇవే.. ఇవి నోట్స్ తయారీ, రీసెర్చ్, రైటింగ్, రివిజన్, ఆర్గనైజేషన్ మొదలైన వాటిలో సహాయపడతాయి. ఈ టూల్స్‌ తో చదువును సులభంగా అర్థం చేసుకొని మంచి ఫలితాలను పొందుతారు.

New Update
Best AI Tools for Students

Best AI Tools for Students

Best AI Tools for Students: ఈ రోజుల్లో విద్యార్థులకు AI టూల్స్ చాలా ఉపయోగపడుతూన్నాయి. విద్యార్థులు చదువు నేర్చుకోవడం దగ్గర నుండి సమయానికి అసైన్మెంట్లు పూర్తి చేయడం వరకు పనులన్నీ క్షణాల్లోనే చాలా ఈజీ గా AI టూల్స్ ని ఉపయోగిస్తూ చేయగలుగుతున్నారు. ఈ AI టూల్స్ పిల్లల చదువును సులభతరం చేయడమే కాకుండా, సమయాన్ని ఆదా చేసి మంచి ఫలితాలు తీసుకురావడంలో సహాయపడతాయి. అయితే ఇప్పుడు మీ పిల్లల కోసం 7 మంచి AI టూల్స్ గురించి తెలుసుకుందాం. 

1. ChatGPT 

మీ పిల్లలకు పాఠాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉందా? అయితే ChatGPTతో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ChatGPT లో మీరు అడిగిన ఎలాంటి ప్రశ్నలకైనా సులభంగా అర్థమయ్యేలా సమాధానాలు దొరుకుతాయి. నోట్స్ తయారు చేయడంలో, ఎస్సే ల అవుట్‌లైన్లు ఇవ్వడంలో, సొంతంగా ప్రాక్టీస్ చేయడానికి క్విజ్ లు తయారు చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని పూర్తిగా ఆధారపడకుండా, మీ సొంత రీసెర్చ్ కూడా మిక్స్ చేయాలి.

Also Read:చైనా చేతిలో అమెరికా రహస్యాలు.. భయంతో వణికిపోతున్న ట్రంప్

2. Notion AI - టాస్క్ మేనేజ్‌మెంట్ కి ది బెస్ట్ AI టూల్ 

Notion ఇప్పటికే ఒక మంచి నోట్ టేకింగ్ యాప్‌గా పేరుపొందింది. మీ లెక్చర్ నోట్స్ ను క్లియర్‌గా సారాంశంగా మార్చుతుంది, టాస్క్ లిస్ట్లు తయారు చేస్తుంది, గ్రూప్ వర్క్‌ లో మీకు సహాయం చేస్తుంది. చదువు, ప్రాజెక్టులు, ఎగ్జామ్‌లు అన్నీ ఒకేచోట నిర్వహించుకోవచ్చు.

3. Grammarly - మీ వ్యక్తిగత రైటింగ్ ఎడిటర్

మీరు ఏదైనా ఇషాన్ని గురించి రాస్తున్నప్పుడు Grammarly మీ ఎస్సే, మెయిల్స్, రిపోర్ట్స్ అన్నింటిని సరైన పదజాలంతో, క్లియర్‌గా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా, ప్లాగియరిజం చెక్ చేయడం వల్ల, మీ కంటెంట్ ఒరిజినల్‌గా ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు.

Also Read: ఐఫోన్ 17 ధర రివీల్.. ఒక్కో మోడల్ ప్రైజ్ ఎంతంటే?

4. Perplexity AI - మీ రీసెర్చ్ అసిస్టెంట్

ఇంటర్నెట్‌లో ఏదైనా విషయానికి సంబంధించిన సమాచారం వెతకడంలో ఎక్కువ సమయం వృథా అవుతుంది. కానీ Perplexity AI ఉపయోగిస్తే, నేరుగా మీకు కావాల్సిన సమాచారం, సమాధానాలుగా మీకు అందుతుంది. ప్రాజెక్టులు, రీసెర్చ్ కు సంబంధించిన విషయాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

5. Quizlet AI 

ఫ్లాష్ కార్డ్స్ తో రివిజన్ చెయ్యడం చాలామందికి నచ్చుతుంది. Quizlet AI మీ నోట్స్ లేదా పాఠ్యపుస్తకాల నుండి ఆటోమేటిక్ గా కార్డ్స్ రూపంలో  తయారు చేస్తుంది. మీకు కావాల్సిన కంటెంట్ మళ్లీ మళ్లీ రివైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గేమింగ్ లాగా మీ చదువు కూడా చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. 

Also Read:తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే!

6. Otter.ai 

క్లాసులో స్పీడ్ గా నోట్స్ రాసేందుకు కష్టపడుతున్నారా? Otter.ai మీ లెక్చర్ ని రికార్డ్ చేసి, ఆడియోని నోట్స్‌ గా మార్చుతుంది. ముఖ్యమైన విషయాలు హైలైట్ చేసి, మీరు తర్వాత సులభంగా వెతుక్కునేలా చేస్తుంది. Zoom, Google Meet లతో కూడా ఇది పనిచేస్తుంది.

7. Claude AI 

పెద్దపెద్ద పీడీఎఫ్ లు, పుస్తకాలు చదవాలంటే Claude AI ఎంతో ఉపయోగకరం. ఇది వాటిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఫిలాసఫీ, లా, సోషియాలజీ వంటి విభాగాల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఐడియా జనరేట్ చేయడంలో, అసైన్మెంట్లను సిద్ధం చేయడంలో ఇది బాగా సహాయపడుతుంది.

AI టూల్స్ మీ కోసం పని చేస్తాయి, కానీ మీరు వాటిని సరికొత్తగా ఉపయోగించుకుంటేనే మీకు నిజమైన లాభం. నోట్స్ తయారు చేయడం, డాక్యుమెంట్లు చదవడం వంటి పనులను AI కి అప్పగించండి, మీరు ఆలోచించడంలో, క్రియేటివ్ గా ఉండడంలో సమయాన్ని కేటాయించండి.  AI ని తెలివిగా ఉపయోగించేవావాళ్ళు చదువుల్లో మంచి సక్సెస్ అవుతారు! మీరు సిద్ధంగా ఉన్నారా? మీ విద్యార్థి జీవితాన్ని మరింత సులభంగా, తెలివిగా మార్చుకోవడానికి అయితే ఈ AI టూల్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

Advertisment
తాజా కథనాలు