/rtv/media/media_files/2025/07/11/amazon-now-service-2025-07-11-15-40-23.jpg)
Amazon Now Service
భారతదేశంలో క్విక్ కామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో బ్లాంకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి కంపెనీలు తమదైన ముద్ర వేశాయి. ఇప్పుడు ఈ రంగంలోకి మరొక ప్రముఖ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ పోటీలోకి వచ్చింది. దీనికోసం అమెజాన్ కొత్తగా ఒక క్యాటగిరీని తీసుకొచ్చింది. కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారులకు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను డెలివరీ చేసేందుకు ‘‘అమెజాన్ నౌ’’ (Amazon Now) అనే సేవలను ప్రారంభించింది.
Amazon Now service
ఎక్కడెక్కడ ప్రారంభమయ్యాయి?
అమెజాన్ తన క్విక్ కామర్స్ సేవలను మొదట బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా గత డిసెంబర్ 2024లో ప్రారంభించింది. ఇప్పుడు ఈ సేవలను ఢిల్లీలోని ఎంపిక చేసిన పిన్‌కోడ్‌లకు విస్తరించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అమెజాన్ తెలిపింది.
క్విక్ కామర్స్ అంటే ఏమిటి?
క్విక్ కామర్స్ అనేది అతి తక్కువ సమయంలో (సాధారణంగా 10 నుండి 30 నిమిషాల్లో) వస్తువులను వినియోగదారులకు డెలివరీ చేసే సేవ. ఇప్పటికే జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లాంకిట్ వంటి కంపెనీలు ఈ రంగంలో మంచి గుర్తింపు, పేరు సంపాదించుకున్నాయి. ఇప్పుడు అమెజాన్ (Amazon Now), ఫ్లిప్‌కార్ట్ (ఫ్లిప్‌కార్ట్ మినిట్స్) వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ విభాగంలోకి చేరాయి.
ఏయే వస్తువులు డెలివరీ చేస్తారు?
Amazon Now ద్వారా కిరాణా సామాగ్రి, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, స్నాక్స్, మాంసం, పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తులు, బ్యూటీ, పర్సనల్ కేర్ వస్తువులు వంటి రోజువారీ అవసరమైన వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తారు.
కంపెనీ ప్రకారం..
బెంగళూరులో లభించిన గొప్ప రెస్పాన్స్ తర్వాత ఈ సేవను ఇప్పుడు ఢిల్లీలో ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ప్రారంభ కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌తో తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని.. త్వరలో ఈ సేవను ఇతర నగరాల్లో కూడా ప్రారంభిస్తామని కంపెనీ చెబుతోంది.