Team India Victory Celebrations: విశ్వవిజేతలకు సన్మానం.. దద్దరిల్లిపోయిన స్టేడియం

17 ఏళ్ల తర్వాత టీ 20 వరల్డ్‌ కప్‌ గెలిచి విశ్వవేదికపై భారత జెండాను ఎగరవేసిన టీమ్‌ ఇండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. సాయంత్రం ముంబయిలోో రోడ్‌ షో ముగిసిన అనంతరం టీమ్ఇండియా వాంఖడే స్టేడియానికి చేరుకుంది. ఆ తర్వాత జట్టు సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు.

New Update
Team India Victory Celebrations: విశ్వవిజేతలకు సన్మానం.. దద్దరిల్లిపోయిన స్టేడియం

17 ఏళ్ల తర్వాత టీ 20 వరల్డ్‌ కప్‌ గెలిచి విశ్వవేదికపై భారత జెండాను ఎగరవేసిన టీమ్‌ ఇండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. ఉదయం ఢిల్లీలో ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రోహిత్ సేన.. ఆ తర్వాత సాయంత్రం ముంబయికి చేరుకుంది. మెరైన్‌ రోడ్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో వరల్డ్ గెలిచిన భారత ఆటగాళ్లు పాల్గొన్నారు.నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్‌ షో కొనసాగింది. ఓపెన్‌ టాప్‌ బస్సుపై నిల్చొని ఆటగాళ్లు అభిమానులకు ట్రోఫితో అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Also Read: భోలే బాబాను అరెస్టు చేయరా ?.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ఈ రోడ్‌ షోలో పాల్గోనేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. రోడ్‌ షో ముగిసిన అనంతరం టీమ్ఇండియా వాంఖడే స్టేడియానికి చేరుకుంది. అప్పటికే స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. దీంతో కెప్టెన్‌ రోహిత్ శర్మ, విరాట్‌ కొహ్లితో పాటు జట్టు సభ్యులందరూ డాన్స్ చేశారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి టీమ్ వెళ్లగానే  స్టేడియం మొత్తం నినాదాలతో దద్దరిల్లిపోయింది. బీసీసీఐ ఆధ్వర్యంలో జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించాక.. రూ.125 కోట్ల నగదు బహుమతిని అందజేశారు.

స్డేజీపై రోహిత్‌ శర్మ, విరాట్ కొహ్లీ భావోద్వైగానికి గురయ్యారు. విరాట్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని చెప్పాడు. మేమిద్దరం గత 15 ఏళ్ల నుంచి టీమిండియా తరఫున ఆడుతున్నామని.. ప్రపంచ కప్ గెలవాలన్నది మా కళ అని తెలిపారు. వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడని.. అతడిని అలా చూడటం ఇదే మొదటిసారి అని అన్నాడు. ఆరోజు ఇద్దరం ఏడ్చామని.. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు.

Also Read: నీట్‌ పరీక్షను రద్దు చేయకండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు