Cricket: మూడో టీ20లో గెలిచిన టీమ్ ఇండియా

సెటిల్ అవడానికి ఒక మ్యాచ్‌ను తీసుకున్న యంగ్ టీమ్ ఇండియా వరుసగా మ్యాచ్‌లను గెలుస్తూ వస్తోంది. ఈరోజు జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ సమిష్టిగా రాణించారు టీమ్ ఇండియా కుర్రాళ్ళు.

New Update
Cricket: మూడో టీ20లో గెలిచిన టీమ్ ఇండియా

India VS Zimbabwe: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. తరువాత 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది. ఇక మొదట రెండు మ్యాచ్‌లలో విఫలమయిన కెప్టెన్ శుభమన్‌గిల్ మూడో మ్యాచ్‌లో బాగా ఆడాడు. గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లో 66 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన అభషేక్‌ వర్మ తొందరగానే ఆవుట్ అయిపోయినా రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. సంజు శాంసన్ (12*; 7 బంతుల్లో 2 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.

తరువాత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మేయర్స్ (65*; 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరవగా.. మండాడే (37; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మసకద్జ (18; 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్ల ధాటికి ఆరంభంలో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయింది. మద్వీర (1), మరుమణి (13), బ్రియాన్ బెనెట్ (4), సికిందర్‌ రజా (15), క్యాంప్‌బెల్ (1) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఈ టైమ్‌లో మడాండే, మేయర్స్ నిలకడగా ఆడి కాస్త పుగులు వరద పారించారు. టీమ్ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో ఐదు టీ20ల సీరీస్‌లో టీమ్ ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.

Also Read:Pawan: అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు