Team India Meets PM Modi : జూన్ 29న బార్బడోస్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి విన్నర్‌గా నిలిచిన టీమిండియా(Team India)..13ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరల్డ్‌కప్ ట్రోఫీతో సగర్వంగా నేడు స్వదేశానికి తిరిగొచ్చింది. నిజానికి మూడు రోజుల క్రితమే ఇండియాకు రావాల్సి ఉన్నా బార్బడోస్‌లో భీకర తుఫాను కారణంగా ఎయిర్‌పోర్టును మూసివేశారు. దీంతో భారత క్రికెట్ టీమ్ మూడు రోజులు అక్కడే చిక్కుకుపోయింది.
ఈ క్రమంలోనే ఈ బీసీసీఐ(BCCI) స్పెషల్ ఫ్లైట్‌లో క్రికెట్ జట్టును నేడు భారత్‌కు తీసుకొచ్చింది. ఈ రోజు ఉదయం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎయిర్ పోర్టులో నినాదాలతో హోరెత్తించారు.కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీని పైకెత్తి అభిమానులకు అభివాదం చేశారు.అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్ ఐటీసీ మౌర్యకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..హోటల్ ఐటీసీ మౌర్య దగ్గర డాన్సులతో అలరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
Also Read : స్వదేశానికి చేరుకున్న విశ్వ విజేతలు!
అక్కడి నుంచి స్పెషల్ బస్సు లో ప్రధాని మోడీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా భారత జట్టును కలిసిన మోడీ.. వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ జట్టును అభినందించారు. అనంతరం రోహిత్ సేనతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసారు . ప్రధానితో సమావేశం తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్‌షోలో పాల్గొననుంది. ముంబై లోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్ షో ఉండబోతుంది. రోడ్ షో అనంతరం రాత్రి వాంఖడే స్టేడియంలో టీమిండియాకు బీసీసీఐ సన్మానం చేయనుంది.