Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు గంభీర్ షాక్.. T20 కెప్టెన్సీ కి నో ఛాన్స్!

టీమిండియా కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో T20 జట్టుకు హార్దిక్ పాండ్యాను కాకుండా వేరేవారిని కెప్టెన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈమేరకు ఇప్పటికే హార్దిక్ పాండ్యాకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. 

New Update
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు గంభీర్ షాక్.. T20 కెప్టెన్సీ కి నో ఛాన్స్!

Hardik Pandya: టీమ్‌ఇండియాను 13 ఏళ్ల తర్వాత  ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంక టూర్‌తో (Sri Lanka Tour) టీమిండియాతో ప్రయాణం ప్రారంభించనున్న టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నుంచి దెబ్బ పడింది. టీమిండియా కోచ్ గా  గంభీర్ ఒక ఆశ్చర్యకరమైన.. సంచలన నిర్ణయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడని  తెలుస్తోంది.  అది T20 జట్టు కెప్టెన్సీ. టీమ్ ఇండియా కొత్త కోచ్ తన ఎంట్రీతో పాటు కొత్త కెప్టెన్‌ను నియమించాలని గంభీర్ భావిస్తున్నాడు. అయితే, ఆ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదు. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియా కొత్త టీ20 కెప్టెన్‌గా తీసుకోవాలని గంభీర్ భావిస్తున్నాడని జాతీయ మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి. అంతేకాకుండా,  శ్రీలంక సిరీస్‌లోనే కాకుండా చాలా కాలం పాటు సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఈ బాధ్యతను నిర్వహిస్తాడని ఆ కథనాలు వెల్లడించాయి. 

టీ20 ప్రపంచకప్‌ను టీమ్ ఇండియా గెలుచుకున్న తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు టీ20కి తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది. జింబాబ్వే పర్యటనలో శుభ్‌మన్ గిల్‌కు ఈ బాధ్యత అప్పగించారు.  అయితే ప్రపంచ ఛాంపియన్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో లేరు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వంటి సీనియర్ ఆటగాళ్ళు జూలై 27 నుండి శ్రీలంక పర్యటన కోసం  తిరిగి రాబోతున్నారు. అటువంటి పరిస్థితిలో హార్దిక్ టి 20 జట్టుకు బాధ్యత వహిస్తాడని  ఇప్పటివరకూ అనుకున్నారు.  ప్రపంచ కప్ సమయంలో అతను జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు.  వాస్తవానికి అతను ఈ ఫార్మాట్‌లో జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. 

కెప్టెన్సీ మార్చాల్సిందే.. 

Hardik Pandya: ఇప్పుడు అలా కుదరదని కోచ్ గంభీర్ అంటున్నట్టు  తెలుస్తోంది. కోచ్ గంభీర్ కేవలం ఈ సిరీస్ కోసమే కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నాడని, అందుకే అదే ప్రాతిపదికన కెప్టెన్‌ని నియమించాలని కోరుతున్నాడని పిటిఐని ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.  2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని శాశ్వత కెప్టెన్‌ను నియమించాలని నిర్ణయించారని, ఇందుకోసం సూర్యకుమార్ యాదవ్ పేరుపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. 

Also Read: గంభీర్ లాంటి కోచ్ కావాలి..ఢిల్లీ క్యాపిటల్స్!

అంతేకాకుండా, గంభీర్ ఈ విషయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కూడా మాట్లాడాడు వారిద్దరూ కలిసి హార్దిక్ పాండ్యాతో మాట్లాడి, జట్టు నాయకత్వంలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి తమ నిర్ణయం, ప్రణాళిక గురించి చెప్పారని తెలుస్తోంది. 

సూర్య రేసులో ముందున్నాడు

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి లేవనెత్తుతున్న ప్రశ్నలు పూర్తిగా నిరాధారమైనవని, అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్న తర్వాత T20 సిరీస్‌కు తిరిగి రాబోతున్నాడని BCCI వర్గాలని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. హార్దిక్ కెప్టెన్ అవుతాడని భావించిన సోర్సెస్ ఇప్పుడు ఈ రేసులో సూర్యకుమార్ యాదవ్ ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాతో జరిగిన మొత్తం 7 మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. , ఇందులో 5 విజయాలు - 2 ఓటములు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు