Indian Cricket Team: ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసిన విశ్వ విజేతలు స్వదేశానికి చేరుకున్నారు. కరేబియన్ గడ్డ మీద జరిగిన ICC T20 వరల్డ్ కప్ 2024 లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ (Rohit Sharma) తన జట్టుతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత బృందం బుధవారం చార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి బయలుదేరింది. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 ప్రపంచకప్ అనే ప్రత్యేక పేరుతో ఎయిర్ ఇండియా ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ గురువారం ఉదయం 6:20 కి దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) చేరుకుంది.
బెరిల్ తుఫాన్ కారణంగా భారత జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు, సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబాలు, బోర్డు అధికారులు, ట్రావెలింగ్ మీడియా బృందం సుమారు 2 రోజులు పాటూ వేచి చూసిన తరువాత తరువాత వాతావరణం అనుకూలంగా మారడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి చార్టర్ విమానాన్ని ఏర్పాటు చేసింది. బార్బడోస్‌లో చిక్కుకున్న భారతీయ జర్నలిస్టులు, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జే షాతో కలిసి అదే విమానంలో ఎక్కారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు.
ప్రపంచ కప్ స్వదేశానికి చేరుకున్న వీడియో ను ఇప్పటికే బీసీసీఐ (BCCI) తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది. విమానం టెర్మినల్ 3 దగ్గరకు వచ్చే సమాచారంతో అక్కడ ఆటగాళ్ళ కోసం అధికారులు ప్రత్యేక బస్సును నిలిపి ఉంచారు. ఈ నేపథ్యం లో విమానాశ్రయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు!