/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/chandra-babu-jpg.webp)
TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్య సభ ఎన్నికల (Rajya Sabha Elections) పోటీకి దూరంగా ఉండనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత అభ్యర్థిని పోటీలో పెట్టాలని టీడీపీ ఆలోచించింది. వైసీపీలో (YCP) అసంతృప్త ఎమ్మెల్యేలు (YCP MLA'S) తమ అభ్యర్థికి ఓటు వేస్తారనే ఆలోచనలో టీడీపీ ఉంది. అయితే.. చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
ALSO READ: మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కి బీజేపీ రాజ్యసభ సీటు
ఏపీలో ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 27న రాజ్యసభ సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే వైసీపీ (YCP) తరపున బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో వైసీపీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్లు వేశారు.
వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి టచ్‌లోకి..
ఉండవల్లిలోని నివాసంలో పలువురు నేతలతో చంద్రబాబు (Chandrababu) సమావేశం అయ్యారు. రా కదలిరా, లోకేష్ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై నేతలతో చర్చలు జరిపారు. చంద్రబాబుతో యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని, గొట్టిపాటి, కంభంపాటి భేటీ అయ్యారు. వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి టచ్‌లోకి వస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని.. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదని ఆ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు తేల్చి చెప్పారు.
ALSO READ: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
DO WATCH: