Andhra Pradesh: పేద రైతు కుటుంబం నుంచి కేంద్ర సహాయ మంత్రి వరకూ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ ప్రయాణం

టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవి పొందిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల్లోకి చేరిన పెమ్మసాని ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గవర్నమెంటు పాఠశాల విద్యాభ్యాసం నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు చంద్రశేఖర్ ప్రయాణం ఇదీ..

Andhra Pradesh: పేద రైతు కుటుంబం నుంచి కేంద్ర సహాయ మంత్రి వరకూ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ ప్రయాణం
New Update

Pemmasani Chandra Sekhar: పెమ్మసాని చంద్రశేఖర్...కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్న ఈ నేత పుట్టింది మాత్రం ఓ సాధారణ రైతు కుంటంబ ఇంట్లో. ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకున్నారు. తన ప్రతిభతో విదేశాలకు వెళ్ళడమే కాకుండా...అక్కడ వ్యాపారంలో కూడా విశేషంగా రాణించారు. బోలెడంత డబ్బు సంపాదించారు. అయినా కూడా ఏదో వెలితి. తన దేశం కోసం ఏమీ చేయలేకపోతున్నానే వ్యధ. ఆ బాధతోనే దేశానికి తిరిగి వచ్చేశారు చంద్రశేఖర్. అప్పుడే రాజకీయాల్లోకి చేరారు. అక్కడ మొదలైంది పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ ప్రస్థానం.

బాల్యం, చదువు..
పెమ్మసాని చంద్రశేఖర్ .. 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించారు. చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు, ఆయనకు ఒక సోదరుడు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటా లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. చిన్నప్పటి నుంచీ కష్టపడి చుదవుకున్న చంద్రశేఖర్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు సాధించారు. ఆ తరువాత ఉస్మానియాలో డాక్టర్ చదివిన ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వెళ్ళారు. పీజీ పూర్తి చేసిన తర్వాత జాన్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా ఉద్యోగం చేశారు. దాంతో పాటూ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా సహాయం చేసేవారు. చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నో ఆన్లైన్ లో అందించేవారు. ఇది ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. దాంతో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇది బాగా ఎక్కువ అవడంతో చంద్రశేఖర్ విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఇందులో నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా అమెరికాలో ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు చంద్రశేఖర్.

రాజకీయ ప్రయాణం...

పెమ్మసానికి ఎన్టీ రామారావు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈయన తండ్రి కూడా టీడీపీ నేతే కావడం గమనార్హం. పెమ్మసాని మొదట నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. చంద్రశేఖర్‌కు మొదట నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబు అంటే చాలా ఇష్టం. యూఎస్‌లో ఉన్నప్పుడు బాబు మీటింగ్స్ ఎక్కడ ఉన్న ఆతప్పనిసరిగా హాజరయ్యేవారు. అలా ఆయనతో పరిచయాన్ని కూడా పెంచుకున్నారు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబుతో కలిసి పని చేయడం ప్రారంభించారు పెమ్మసాని.

2014 నుంచి పెమ్మసాని రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. అదే ఇయర్‌లో ఆయన నర్సరావుపేట నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. అప్పుడు రాలేదు. తరువాత 2019లోనూ ఇదే ప్రయత్నం చేశారు. రెండుసార్లూ మాజీ ఎంపీ, సీనియర్ అయిన రాయపాటి సాంబశివరావుకు టికెట్ ఇవ్వడంతో చంద్రశేఖర్‌కు అవకాశం రాలేదు. ఈసారి మొదటి నుంచి పెమ్మసానికి టికెట్ ఇస్తారని అనుకున్నారు. ఆయనకు నరసాపురం టికెట్ వస్తుందని భావించారు.అయితే సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాని చెప్పడంతో ఆ స్థానాన్ని చంద్రశేఖర్‌కు ప్రకటించారు చంద్రబాబు. అలా గుంటూరు నియోజకవర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయడమే కాదు..అందులో నెగ్గి, కేంద్ర సహాయ మంత్రిగా కూడా నియమితులవ్వబోతున్నారు.

Also Read:Australia: భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో

#tdp #mp #leader #central-minister #pemmasani-chandra-sekhar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe