TDP : అభ్యర్థి మార్పుపై భగ్గుమంటున్న తెలుగు తమ్మళ్ళు

మడకశిర టీడీపీలో అభ్యర్థి మార్పుపై మంటలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఫ్లెక్సీలను రోడ్డుపై తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు. లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
TDP : అభ్యర్థి మార్పుపై భగ్గుమంటున్న తెలుగు తమ్మళ్ళు

Anantapur : అనంతపురం జిల్లా  మడకశిర టీడీపీ(TDP) లో అభ్యర్థి మార్పుపై మంటలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఆఫీసులో ఉన్న పార్టీ జెండాలు, ప్లెక్సీలను చెప్పులతో కొడుతూ తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు. మోసకారి చంద్రబాబు(Chandrababu) అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్‌లు అందజేత.. ఆరుగురు అభ్యర్థులను మార్చిన చంద్రబాబు

MS రాజు(MS Raju) గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కుమార్‌కు ముందుగా టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం తాజాగా, అభ్యర్ధిని మార్చడంతో టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు