TDP Leader Murder Case : టీడీపీ (TDP) నేత శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీ వీడింది. కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ నియోజకవర్గం హోసూరులో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, టీడీపీ నేత నర్సింహులుతో శ్రీనివాసరావుకు కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజకీయ పట్టు కోసం ఇద్దరి మధ్య గొడవలు తరుచు జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో నర్సింహులును శ్రీనివాసరావు చెప్పుతో కొట్టాడు.
ఆరోజు నుంచి శ్రీనివాసరావుపై నర్సింహులు కక్ష పెంచుకున్నాడు. ఆ పగతోనే శ్రీనివాస్ ను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసరావుకు వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగడంతో జీర్ణించుకోలేక పోయిన నర్సింహులు.. గ్రామానికి చెందిన నలుగురి సహకారంతో శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లినపుడు రాడ్లతో కొట్టి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం.
Also Read : ముగిసిన ఢిల్లీ పర్యటన.. నేడు ఏపీకి సీఎం చంద్రబాబు