Lokesh : జగన్ పాలనలో ఉద్యోగులు బలవుతున్నారు.. లోకేష్ గరం!

జ‌గ‌న్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ పాల‌న‌ని అంత‌మొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Lokesh: నీ హెచ్చరికకు భయపడేది లేదు.. జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్
New Update

TDP Lokesh: సీఎం జగన్ పై(CM Jagan) విమర్శలు చేశారు టీడీపీ నేత నారా లోకేష్(Nara Lokesh). జగన్‌ ప్రభుత్వం ఉద్యోగుల(Government Employees Suicide In AP) ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. జగన్‌ పాలనలో అధికారుల ప్రాణాలకు రక్షణ లేదని తేలిపోయిందని అన్నారు. వైసీపీ నేతల(YCP Leaders) వేధింపులతో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు వందల మంది ఉద్యోగులు బలయ్యారని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల అవినీతికి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు బలికావాలి? అని ప్రశ్నించారు.

ALSO READ : చంద్రబాబు విలన్ .. సిద్ధం సభలో రెచ్చిపోయిన సీఎం జగన్

నారా లోకేష్ ట్విట్టర్(X) లో... "ఉద్యోగులారా ఆత్మహత్యలొద్దు.. ఆత్మ స్దైర్యంతో ఉండండి. విశాఖ‌జిల్లా(Visakha District) లో వైసీపీ భూ అక్రమాల‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని వైసీపీ నేత‌లే త‌హ‌సీల్దార్ స‌న‌ప‌ల ర‌మ‌ణ‌య్యని అత్యంత‌ దారుణంగా చంపేయ‌డం జ‌గ‌న్ పాల‌న‌లో ప్రభుత్వ అధికారుల ప్రాణాల‌కు ర‌క్షణలేద‌ని తేలిపోయింది. బాప‌ట్ల జిల్లా చావ‌లి గ్రామ ఆర్బీకేలో వ్యవ‌సాయ స‌హాయ‌కురాలిగా ప‌నిచేస్తున్న బి పూజిత ఆత్మహత్యకు కారణం వైసీపీ నేత‌లు ఎరువులు ఎత్తికెళ్లిపోవ‌డ‌మే. బంగారు భ‌విష్యత్తు ఉన్న ఒక యువతిని బలిగొన్నది వైసీపీ నాయ‌కులే.

విజ‌య‌న‌గ‌రం జిల్లా(Vijayanagaram District) రాజాంలో పంచాయ‌తీరాజ్ శాఖ‌లో కాంట్రాక్ట్ బేసిక్ ప‌నిచేస్తున్న జేఈ వ‌ల్లూరు రామ‌కృష్ణని మాయ‌చేసి వైసీపీ నేత‌లు సిమెంటు ఎత్తుకెళ్లారు. ఉన్నతాధికారులు సిమెంటు లెక్క చెప్పమంటూ ఒత్తిళ్లు, వైసీపీ నేత‌లు దిక్కున్నచోట చెప్పుకోమ‌ని బెదిరించ‌డంతో రామ‌కృష్ణ పంచాయ‌తీరాజ్ కార్యాల‌యంలోనే ఉరివేసుకుని త‌నువు చాలించారు. ఇది వైసీపీ నేత‌లు చేసిన హ‌త్య కాదా?

త‌ప్పులు చేసిన వైసీపీ నేత‌లు కాల‌రెగ‌రేసుకుని తిరుగుతుంటే.. ఏ త‌ప్పూ చేయ‌ని మీరెందుకు ఆత్మహత్యలకు పాల్పడాలి? త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను వేధించిన వైసీపీ నాయకుల్ని కఠినంగా శిక్షిస్తాము.' అంటూ రాసుకొచ్చారు.

Also Read : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు?

DO WATCH: 

#employees-suicide-in-ap #tdp #ycp #lokesh #ap-latest-news #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe