Nara Lokesh: ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేష్

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. గురువారం నారా లోకేష్ కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం వద్ద పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్తులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని లోకేష్ కు వివరించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. జగన్ ఆయన సామంత రాజులు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల రూపాయల ఇసుకను దోచేశారని ఫైర్ అయ్యారు.

New Update
Nara Lokesh Yuvagalam: యువగళం యాత్రపై నారా లోకేష్ సంచలన నిర్ణయం.. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్

TDP Leader Nara Lokesh Fires on AP CM Jagan: తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. గురువారం నారా లోకేష్ కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం వద్ద పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్తులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని లోకేష్ కు వివరించారు.

అధికారంలోకి వచ్చా గ్రామ సమస్యలను పరిష్కరిస్తాం: లోకేష్

అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. జగన్ ఆయన సామంత రాజులు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల రూపాయల ఇసుకను దోచేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి రాగానే మెరుగైన పాలసీ ద్వారా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టంచేశారు. గ్రామీణ, పట్టణప్రాంతాలనే తేడా లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందజేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రోడ్లన్నింటినీ పునర్నిర్మిస్తామని చెప్పారు నారా లోకేష్.

200 రోజులకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర:

కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులకు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుంచి 200వ రోజు యువగళం పాదయాత్రను యువనేత లోకేష్ ప్రారంభించారు. యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు.

2700 కిలో మీటర్ల మైలురాయిని యువగళం పాదయాత్ర:

అయితే గురువారం 2700 కిలో మీటర్ల మైలురాయిని యువగళం పాదయాత్ర చేరుకోనుంది. 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెంలో గిరిజనులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు. 200 రోజుల పాదయాత్ర సందర్భంగా లోకే‌ష్ కు శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున నాయకులు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ప్రజలు పాదయాత్ర జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి:

మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం

Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!!

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు