Nara Lokesh: ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేష్
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. గురువారం నారా లోకేష్ కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం వద్ద పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్తులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని లోకేష్ కు వివరించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. జగన్ ఆయన సామంత రాజులు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల రూపాయల ఇసుకను దోచేశారని ఫైర్ అయ్యారు.