TDP Leader Nara Lokesh Comments: అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం: నారా లోకేష్
రాబోయే చంద్రన్న ప్రభుత్వంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వెల్లడించారు తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోన్న నారా లోకేష్ పాదయాత్ర.. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆదివారం సాయత్రం ప్రారంభమైంది. యువనేత లోకేష్ కు మద్దతు ఇస్తూ యువతీ యవకులు భారీగా రోడ్లపైకి తరలి వస్తున్నారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజలు లోకేష్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.