Ganta Srinivasa Rao: స్పీకర్ తమ్మినేనికి గంటా శ్రీనివాస్ సవాల్!

మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది.

New Update
Ganta Srinivasa Rao: టార్గెట్ జగన్.. త్వరలో విశాఖ ఫైల్స్.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Ganta Srinivasa Rao: తన రాజీనామా ఆమోదంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని ఇప్పుడు ఆమోదించడంపై అభ్యంతరం తెలిపారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ పిటిషన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది.

ALSO READ: అలా చేసింది జగనే.. సాక్ష్యం విజయమ్మ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికలకు ముందే..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్ తమ్మినేని తీరా ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

టీడీపీకి షాక్..

కాగా, ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 3 రాజ్య సభ స్థానాలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీకి షాకిచ్చేలా అధికార పార్టీ వైసీపీ పెద్ద ప్లాన్ వేసింది. రాజ్యసభ ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం తగ్గించేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే గంటా పదవి రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ప్లాన్ ఇదేనా..?

స్పీకర్ సీతారం తాజా నిర్ణయంతో గంటా రాజ్య సభ్య ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోతారు. దీంతో రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గినట్టేనని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ నెల 22న రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ నార్త్‌ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా..రాబోయే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి గంటా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ALSO READ: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు