Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అందరితోనూ ఆడుకుంటున్నాడని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్స్ చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆడుకుందాం ఆంధ్ర అని ప్రభుత్వం పిలుపునివ్వడంపై సెటైర్లు వేశారు. జగన్ సీఎం అయ్యాక.. పారిశుద్ధ్య, అంగన్వాడీ, భవన కార్మికులతో ఆడుకుంటున్నారని, సొంత చెల్లి, తల్లితో కూడా ఆడుకుంటున్నాడని విమర్శించారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో జగన్ ఆడుకుంటున్నారని అన్నారు. 'స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఆడుకుంటున్నారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో ఆడుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆడుకుంటున్నారు. న్యాయస్థానాలతో కూడా ఈ జగన్ ఆటలు ఆడుకుంటున్నారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యనారాయణ. ఈ రోజు ఆడుకుందాం ఆంధ్రా అని పిలుపునిస్తున్నారని, ఓ పక్క కరోనా వ్యాప్తి చెందుతుంటే.. ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకుండా సీఎం ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్స్ ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఆర్జీవీ తీరుపై మండిపాటు..
ఇదే సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన సినిమాపై తీవ్రంగా స్పందించారు సత్యనారాయణ. నీతి మాలిన రాంగోపాల్ వర్మను దర్శక, నిర్మాత మండలి బహిష్కరించాలన్నారు. సమాజానికి పనికొచ్చే సినిమాలు తీసే వారిని ప్రోత్సాహించాలన్నారు. తమపై సినిమాలు తీసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, సినిమాలో బాబు, లోకేష్ పాత్రాలను వ్యతిరేకంగా చూపించాలనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు సత్యనారాయణ. సినిమా రిలీజ్ అవ్వదని, ఒకవేళ సినిమా రిలీజ్ అయితే తమ కార్యకర్తలను ఆపలేమని స్పష్టం చేశారు బండారు సత్యనారాయణ. వైఎస్ షర్మిల క్రిస్మస్ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పడం ఆనందదాయకం అన్నారు. రాజకీయాల్లో విలువలకు నిదర్శనం ఈ సందర్భం అని పేర్కొన్నారు.
Also Read:
కాకా నువ్ కేక.. ఆయన మీసం పొడవెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!