TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు.

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఈసీ షాక్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు
New Update

TDP Leader Ayyanna Patrudu arrested by Police at Visakhapatnam International Airport: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు.

అయ్యన్న పాత్రుడిని బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లిన పోలీసులు:

కాగా శుక్రవారం ఉదయం ఎయిర్ ఏషియా విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన 10.05 గంటలకు విశాఖకు చేరుకున్నారు. పావు గంట తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయన.. తన కారు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టి, బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అయ్యన్నను బలవంతంగా అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం అయ్యన్న మొబైల్ స్విచ్ఛాఫ్ ఉంది. మరి పోలీసులు నెక్ట్స్ ఏం చేస్తారు, దీనిపై టీడీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్నది త్వరలో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో.. Aditya L1 Mission ప్రయోగానికి అంతా సెట్

IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు

Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!

#tdp #visakhapatnam #vizag #visakhapatnam-international-airport #international-airport #ayyanna-patrudu-arrest #tdp-leader-ayyanna-patrudu #tdp-leader-ayyanna-patrudu-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe