TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు.