Andhra Pradesh : రేపే టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. హైలెట్స్ ఇవే!

రేపు (మంగళవారం) టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. తమ ఉమ్మడి మెనిఫెస్టోను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.00 PM గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేయనుంది కూటమి.

Andhra Pradesh : రేపే టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. హైలెట్స్ ఇవే!
New Update

Joint Manifesto : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో రాజకీయాలు(Politics) రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం(Election Campaign) లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వచ్చే నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రేపు (మంగళవారం) టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి(TDP-Janasena-BJP Alliance).. తమ ఉమ్మడి మెనిఫెస్టోను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.00 PM గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో.. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

Also read: ఆస్తి కోసం తండ్రిని చచ్చేలా కొట్టిన కొడుకు..నాన్న మృతి

2023లో రాజమండ్రిలో జరిగిన మహానాడులో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది. ఆ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మూడు పార్టీలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టోను రూపొందించారు. 'రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం' అనే థీమ్‌తో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అధిక పన్నులు, టాక్స్‌ల బాదుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ది అనే కాన్సెప్ట్‌తో మేనిఫెస్టో ఉండనున్నట్లు సమాచారం. వచ్చే 5 ఏళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో పాటు.. ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై సీఎం జగన్(CM Jagan) చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. లబ్దిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశాలపై లోతైన కసరత్తు చేసిన తర్వాతే పథకాలు రూపొందిచామని చెబుతున్నారు. తమ సూపర్ సిక్స్ ముందు ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందని అంటున్నారు.

Also read: కూటమిలో దడ పుట్టిస్తున్న రెబల్స్!

#lok-sabha-elections-2024 #telugu-news #tdp-janasena-bjp-alliance #ap-assembly-election-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe