Bandaru Satyanarayana: టీడీపీ మాజీ మంత్రికి అస్వస్థత

టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయనకు బీపీ, షుగర్ స్థాయిలు పెరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Bandaru Satyanarayana: టీడీపీ మాజీ మంత్రికి అస్వస్థత
New Update

TDP EX- Minister Bandaru Satyanarayana: టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయనకు బీపీ, షుగర్ స్థాయిలు పెరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెందుర్తి టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆయన మనస్తాపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: దేవినేని ఉమకు ఊహించని ట్విస్ట్

పొత్తు తెచ్చిన తంటా..

ఏపీలో రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో పోటీలో దిగనున్నారు. అయితే.. పొత్తులో భాగంగా పెందుర్తి టికెట్ ను జనసేనకు కేటాయించారు చంద్రబాబు. ఈ క్రమంలో తనకు టికెట్ రాలేదని ఆందోళనలో ఉన్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. తనకు టికెట్ ఇస్తే పెందుర్తిలో ఈ సారి పసుపు జెండా ఎగరవేస్తానని చంద్రబాబు పలు సార్లు చెప్పిన ఫలితం లేకుండా అయింది. పొత్తు ధర్మం ప్రకారం ఆ టికెట్ ను జనసేనకే ఇస్తున్నట్లు ఖరాఖండీగా చంద్రబాబు సత్యనారాయణకు చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే మంచి అవకాశం కల్పిస్తానని మాజీ మంత్రి సత్యనారాయను చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. స్వయంగా చంద్రబాబే హామీ ఇచ్చిన సరే సత్యనారాయణ మాత్రం ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆరాటపడుతున్నట్లు టీడీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2019 ఎన్నికల్లో ఓటమి..

గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేతిలో ఓటమి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్యనారాయణకు 70,899 ఓట్లు రాగ.. వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి కి 99,759 ఓట్లు వచ్చాయి. దాదాపు 28 వేల ఓట్లతో తేడాతో సత్యనారాయణ ఓటమి చెందారు. అలాగే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి  గండి బాబ్జీ పై 18,648 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏదిఏమైనా ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు మాజీ మంత్రి సత్యనారాయణకు టికెట్ ఇవ్వలేదు. పెందుర్తి నుంచి ఉమ్మడి పార్టీలు బలపరిచిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పోటీలో దిగనున్నారు. మారి రానున్న ఎన్నికల్లో పెందుర్తిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందో జూన్ 4వ తేదీన తేలనుంది.

#tdp #ap-elections-2024 #bandaru-satyanarayana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe