Chandrababu : నేడు మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విజయవాడ, గుంటూరు, తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసులకు వెళ్లనున్నారు. IRR, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో పూచీకత్తు, షూరిటీలను సీఐడీ అధికారులకు చంద్రబాబు ఇవ్వనున్నారు. By V.J Reddy 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి TDP Chief Chandrababu : టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి సీఐడీ కార్యాలయానికి(CID Office) వెళ్లనున్నారు. ఏకంగా మూడు సీఐడీ కార్యాలయాలకు ఈ రోజు వెళ్లనున్నారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి(Tadepalle) లోని సీఐడీ ఆఫీసులకు వెళ్లనున్నారు. IRR, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ కేసుల్లో పూచీకత్తు, షూరిటీలను సీఐడీ అధికారులకు చంద్రబాబు ఇవ్వనున్నారు. ALSO READ: ఢిల్లీలో సీఎం రేవంత్.. కోటి ఆశలతో కోదండరాం! షరతులతో కూడిన బెయిల్.. ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుకు అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు(AP High Court). ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే.. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra), విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేశ్‌కూ ముందస్తు బెయిల్ మంజూరైంది. షరుతలతో బెయిల్ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడవద్దంటూ చంద్రబాబుకు కండీషన్స్ పెట్టింది హైకోర్టు. ఏపీ సీఐడీ(AP CID) టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR), ఇసుక, మద్యం(Liquor Scam) వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదు చేసింది. చంద్రబాబుపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు తరఫున లాయర్లు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. సంగతేంటి? మూడు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం రేపిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ13గా ఉన్న చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రకాంత్ షా మొబైల్ ఫోన్, డాక్యుమెంట్స్, ల్యాప్ టాప్స్ ఏసీబీ కోర్టుకు సమర్పించారు ఏపీ సీఐడీ అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో సైంటిఫిక్ ఎనాలసిస్ తర్వాత చంద్రకాంత్ షా ను ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. తాను అప్రూవర్ గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు ఆయన తెలిపారు. చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ALSO READ: ఆ పరిస్థితిలో కేటీఆర్ లేడు.. జీవన్ రెడ్డి సెటైర్లు! #ap-ex-cm-chandrababu #ap-assembly-elections #tdp-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి