TDP Chief Chandrababu Tweet on CM Jagan: వివేకా హత్య కేసుపై షర్మిల, సునీతను ఉద్దేశిస్తూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ట్విట్టర్ లో.. " తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా... మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?.. ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?" అంటూ ఫైర్ అయ్యారు.
చంద్రబాబుకు సజ్జల కౌంటర్..
సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna) . ఆయన ట్విట్టర్ (X) లో.. "సీఎం జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది." అంటూ కౌంటర్ ఇచ్చారు.
అసలు జగన్ ఏమన్నారు..
వివేకా హత్య పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. వైఎస్ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారని.. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు? అని షర్మిలను, వివేకా కూతురు సినీతా రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు?, వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా?, అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? అని ప్రశ్నించారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్ ఇచ్చానని అన్నారు. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: ‘ఆర్గానిక్’ ఫుడ్ లోనూ క్యాన్సర్ కారకాలు.. మొత్తం 527 ఐటెమ్స్.. షాకింగ్ రిపోర్ట్!