Chandrababu: 'నన్ను ఆయన అర్ధం చేసుకున్నారు'.. గద్దర్ ఇంటికి చంద్రబాబు!

పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్‌ అని కొనియాడారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. గద్దర్‌ మరణం బాధ కలిగించిందన్నారు. గద్దర్‌ కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన సమయంలో సీఎంగా చంద్రబాబే ఉన్నారు.

New Update
Chandrababu: 'నన్ను ఆయన  అర్ధం చేసుకున్నారు'.. గద్దర్ ఇంటికి చంద్రబాబు!

చంద్రబాబు హయాంలోనే ప్రజాగాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గద్దర్‌ మరణించిన తర్వాత ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా మరోసారి గద్దర్‌ విషయంలో చంద్రబాబు(chandrababu naidu) వార్తల్లో నిలిచారు. ఇటివలే మరణించిన గద్దర్‌(gaddar) ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

గద్దర్‌ గురించి చంద్రబాబు ఏమన్నారంటే ? :

➡ గద్దర్ చనిపోవడం బాధాకరం.

➡ ఆయన ఒక వ్యక్తి కాదు వ్యవస్థ.

➡ ప్రజా చైతన్యంతో మొదట గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్.

➡ ఆయన పాట, ఆయన కృషి ఎప్పటికి మర్చిపోలేము.

➡ పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి.

➡ రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యం కోసం పని చేస్తే... గద్దర్ ప్రజలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఒక పందా ఎన్నుకొని కృషి చేశారు.

➡ పోరాటాలకు నాంది పలికారు.

➡ తెలంగాణ పోరాటంలో ఎంతో కృషి చేశారు.

➡ ఆయనను చూస్తేనే ప్రజా యుద్ధ నౌక గుర్తు వస్తుంది.

➡ దేనికి భయపడని వ్యక్తి గద్దర్.

➡ పోరాటాలే ప్రాణంగా బతికారు.

➡ ఆయన స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది.

➡ ఆయన త్యాగాల ఫలితమే లక్షల మంది అభిమానానికి కారణం.

➡ తెలుగు జాతి మంచి ఉద్యమ కారుడిని కోల్పోయింది.

➡ ఆయన మృతి చాలా బాధ, ఆవేదన కలిగించింది.

➡ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

➡ కుటుంబ సభ్యులు ఆయన ఆశయాలు కొనసాగించాలి.

➡ అన్ని విషయాలు అన్నతో మాట్లాడాము... కాల్పుల ఘటనపై ఆయనతో చర్చించాం.

అపోహలు సృష్టించారు.. కానీ ఆయన నన్ను అర్థం చేసుకున్నారు.

➡ ఆయనతో అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశాం.

అసలేం జరిగింది:
ఏప్రిల్ 6, 1997లో గద్దర్‌ ఇంటి వద్ద ఆయనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అప్పుడు ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. ప్రభుత్వ సంస్థలను పట్టించుకోకుండా ప్రైవేట్ జపం చేస్తున్నారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గద్దర్‌ తన పాటల ద్వారా యావత్‌ సమాజాన్ని ఛైతన్యపరుస్తున్నారు. తెలంగాణ నినాదం కూడా అగ్గి రాజుకుంటున్న రోజులు కూడా అవే. అదే సమయంలో గద్దర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. ఐదు బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లాయి. అందులో నాలుగు బుల్లెట్లను డాక్టర్లు బయటకు తీశారు కానీ.. వెన్ను దగ్గరలోని బుల్లెట్‌ని మాత్రం అలానే ఉంచేశారు. అది తీస్తే గద్దర్‌ ప్రాణానికే ప్రమాదమని అలా చేశారు. ఈ ఘటన జరిగి 27ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గద్దర్‌పై కాల్పులు జరిపింది ఎవరో తెలియలేదు. ఆయన వెన్నులోని బుల్లెట్ గ్రే హోండ్స్‌ దళాలకు చెందినదని గద్దర్‌ అనేకసార్లు ఆరోపించినా కేసు ముందుకు కదలలేదు.

Advertisment
తాజా కథనాలు