నేడు ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు.. ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర!
ప్రజాగాయాకుడు గద్దర్ మరణం ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. బీటెక్ చదివిన గద్దర్ విప్లవ బాట పట్టడం.. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ఇలా ఏం చేసినా అది గద్దర్‌కే చెల్లింది. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై పోలీసుల కాల్పులు జరపగా.. శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. దాదాపు అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులకు.. ఓ బుల్లెట్‌ని మాత్రం తొలగించలేకపోయారు. ఆయన శరీరంలో ఇప్పటికీ ఆ బుల్లెట్ అలానే ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేపోతున్నారు.