కుప్పం(Kuppam) లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ సీఎం జగన్ (Jagan) మీద మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో వాటాలు అడుగుతున్న కారణంగానే పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రామకుప్పంలో జరిగిన జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
ఈ క్రమంలో ఆయన నాకు వయసు అనేది ఓ నంబర్ మాత్రమే..కానీ నా ఆలోచనలు మాత్రం 15 ఏళ్ల కుర్రాడివే. నా ఆలోచనలు అన్ని కూడా వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఉంటాయని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ తో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హంద్రీ నీవాలో నీళ్లు పారించమంటే అవినీతి పారిస్తున్నారంటూ అధికార పక్ష నాయకుల మీద విరుచుకుపడ్డారు. బటన్లు నొక్కి ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం తో మరో నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు.మిగిలిన ప్రజలంతా కూడా రోడ్డున పడ్డారంటూ ధ్వజమెత్తారు.
రానున్న ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు ఇప్పటికే జగన్ కి కూడా అర్థం అయిపోయింది. అందుకే మా పై దాడులు , అక్రమ అరెస్ట్ లు చేయిస్తున్నారంటూ తెలిపారు. మీ దాడులకు భయపడేది లేదు. మీరు తిన్నది కక్కిస్తాను. సామాజిక న్యాయం అన్నావు. కానీ ఎవరికీ సామాజిక న్యాయం చేశావంటూ జగన్ ని ప్రశ్నించారు.
మారాల్సింది సీఎం మాత్రమే.. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175 స్థానాలు మనవే. గాడి తప్పిన పాలన మళ్లీ సరి చేయాలి. ఇదే నా కోరిక’ అని వ్యాఖ్యానించారు.
Also read: త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఈసీ!