Chandrababu: సీఎంపై రాయి దాడిలో ఇరికించేందుకు కుట్ర.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

AP: సీఎం జగన్‌పై జరిగిన దాడిలో టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించే కుట్ర జరుగుతుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు వైసీపీ డ్రామాలాడుతుందని ఫైరయ్యారు.

New Update
Chandrababu: ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

TDP Chief Chandrababu:ఇటీవల సీఎం జగన్ (CM Jagan) పై జరిగిన దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సీఎంపై రాయి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలు అయ్యిందని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీఎంపై రాయి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల ముందు వైసీపీ ఆడుతున్న డ్రామా అని ఫైర్ అయ్యారు.

Also Read: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కేసీఆర్ చేసిన తప్పులేనా?

తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు చంద్రబాబు. ప్రభుత్వంపై వ్యతిరేకత దృష్ట్యా కుట్రలు పెంచుతున్నారని అన్నారు. జగన్ పై జరిగిన దాడిని హత్యాయత్నం అంటూ టీడీపీపై బురద వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ (YCP) ప్రయత్నాలను ప్రజలు ఛీత్కరిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగురోజులైనా ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదని.. దాడిపై పోలీసులు ఇంకెందుకు ప్రకటన చేయలేదని నిలదీశారు. నిందితులంటూ అమాయకులైన వడ్డెర కాలనీ యువకులను తీసుకుపోయారని ధ్వజమెత్తారు.

 చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు..

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై (Chandrababu) చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌లకు వైసీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పలాస, రాజాం టీడీపీ ఆద్వర్యంలో ఈనెల 15 వ తేదీన జరిగిన సభలలో చంద్రబాబు సీఎం జగన్ ను ఉధ్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలను కూడా ఎన్నికల సిఇఓ ముఖేష్ కుమార్ మీనాకు అందజేశారు.

Advertisment
తాజా కథనాలు