పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే తాజాగా ఏపీలోని గుంటూరు నుంచి టీడీపీ పార్లమెంట్ సీటు దాదాపు ఖారారైపోయింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భాష్యం రామకృష్ణను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో చివరి నిమిషంలో భాష్యంకు ఎంపీ టికెట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఈసారి జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భాష్యం రామకృష్ణనే బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింనట్లు సమాచారం.
Also Read: జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి
భాష్యం రామకృష్ణ ఆర్థికంగా బలమైన నేత, అలాగే విద్యాసంస్థల అధినేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలో భాష్యం పేరమ్మ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. భాష్యంను బరిలోకి దింపితే పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు.. పలుమార్లు భాష్యం రామకృష్ణను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం.
Also Read: నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు