త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి. దీంతో ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తో త్వరలోనే టీడీపీకోసం పనిచేస్తారన్న వార్తలు హాట్ టాపిగ్గా మారాయి. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం ప్రస్తుతం ఏపీలో జగన్ కోసం పనిచేస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. అయితే గతంలో పీకే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతరాష్ట్రంలో గెలవాలన్న ఆలోచన లేకుండా దేశం మొత్తం తిరుగుతూ ప్రతిపక్షాలను ఏకం చేయాలని చంద్రబాబు ప్రయత్నించి విఫలమయ్యారంటూ కామెంట్స్ చేశారు. ఈనేపథ్యంలో చంద్రబాబు కోసం పీకే పనిచేస్తారన్న వార్తలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
పూర్తిగా చదవండి..ఇదెక్కడి ట్విస్ట్.. చంద్రబాబు కోసం ప్రశాంత్ కిషోర్ పని చేయనున్నారా?
టీడీపీ అధినేత చంద్రబాబు...ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ ల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ జగన్ కోసం పనిచేస్తుంది. ఈ తరుణంలో చంద్రబాబుతో, ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
Translate this News: