ఇదెక్కడి ట్విస్ట్.. చంద్రబాబు కోసం ప్రశాంత్ కిషోర్ పని చేయనున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబు...ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ ల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ జగన్ కోసం పనిచేస్తుంది. ఈ తరుణంలో చంద్రబాబుతో, ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. By Bhoomi 21 Aug 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి. దీంతో ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తో త్వరలోనే టీడీపీకోసం పనిచేస్తారన్న వార్తలు హాట్ టాపిగ్గా మారాయి. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం ప్రస్తుతం ఏపీలో జగన్ కోసం పనిచేస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. అయితే గతంలో పీకే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతరాష్ట్రంలో గెలవాలన్న ఆలోచన లేకుండా దేశం మొత్తం తిరుగుతూ ప్రతిపక్షాలను ఏకం చేయాలని చంద్రబాబు ప్రయత్నించి విఫలమయ్యారంటూ కామెంట్స్ చేశారు. ఈనేపథ్యంలో చంద్రబాబు కోసం పీకే పనిచేస్తారన్న వార్తలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య తృణముల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే మమతాబెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ కూడా పాతస్నేహితులు. అటు బెంగాల్లో టీఎంసీ గెలుపునకు పీకే పనిచేశారు. దీంతో పీకేను చంద్రబాబుకు సాయం చేసేందుకు దీదీ ఒప్పించినట్లు సమాచారం. అయితే ఈ చర్చలు తుదిదశకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ...జూన్ 2021లో ఏపీకి పనిచేయాలంటూ చర్చలు షురూ అయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో తిరిగి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో కూడా పీకే సహాయం కోసం మమతాబెనర్జీని సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో చిరకాల స్నేహం ఉండటంతో ప్రశాంత్ కిషోర్ ఒప్పించే బాధ్యతను మమతా బెనర్జీ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కోల్‌కతాలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ మధ్య రహాస్య సమావేశాన్ని కూడా దీదీ నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు తనయుడు, లోకేశ్ మమతాబెనర్జీని కలిశారు. 2021లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ భారీ విజయం సాధించిన తర్వాత ఐప్యాక్ నుంచి వైదొలిగారు. టీఎంసీ, బీజేపీపై అఖండ విజయాన్ని సాధించేందుకు కారణమయ్యాడు. ఆతర్వాత జనసూరజ్ పార్టీని స్థాపించిన తన సొంత రాష్ట్రమైన బీహార్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాగా 2019లో జరిగిన ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీని ఓడించడంలో పీకే మార్గదర్శకత్వంలోని ఐప్యాక్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఐప్యాక్ టీం జగన్ కోసం పనిచేస్తోంది. గతేడాది. కిషోర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, మహాత్మా గాంధీ మొదటి సత్యాగ్రహ ప్రచారానికి అనుగుణంగా ఎంచుకున్న ప్రదేశమైన బీహార్‌లోని చంపారన్ నుండి పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత టీఎంసీ అగ్ర ద్వయం త్రైపాక్షిక పొత్తు అంశాన్ని ప్రస్తావించింది. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలోకి తిరిగి రావడానికి చురుకుగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు, టిడిపీతో పొత్తు పెట్టుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఒప్పించినట్లు సమాచారం. చంద్రబాబు ఇప్పుడు ఒకరు కాదు..ఇద్దరు పీకేలతో తాను అధికారంలోకి రావలన్న ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో పీకే వైసీపీతో బంధాన్ని తెంచుకుని...చంద్రబాబుతో జతకట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాల కూటమిలో చేరాలన్న ఉద్దేశ్యంతో దీదీ చంద్రబాబుకు సహాయం చేస్తోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే చంద్రబాబు, బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడంలేదని సమాచారం.కానీ బీజేపీ మాత్రం చంద్రబాబును దూరంగానే ఉంచిది. దీనికి భిన్నంగా కేంద్రంతోనూ, బీజేపీ అగ్రనేతలతోనూ జగన్ మోహన్ రెడ్డి సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో, ఎన్డీయేలో చేరేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకోసం పీకే పనిచేస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. #tdp #jagan #prashant-kishor #indian-political-action-committee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి